Thalliki Vandanam : ఏపీ ప్రభుత్వం( AP government) తల్లికి వందనం పథకం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం రోజున తల్లికి వందనం పథకం కింద నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. అర్హత ఉండి, నిధులు జమ కాని వారికి మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల రెండు వరకు పాఠశాలల్లో చేరిన వారికి పథకం అమలు చేస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. రెండో విడత అర్హుల జాబితాను సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. మరోవైపు ఈ రెండో విడతలో అర్హత కలిగిన లబ్ధిదారులకు నిధుల విడుదలకు ముహూర్తం కూడా నిర్ణయించారు. ముఖ్యంగా ఒకటో తరగతిలో ప్రవేశించిన వారికి, ఇంటర్ ఫస్టియర్ లో చేరిన వారికి రెండో విడత నిధులు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
10న నిధులు విడుదల
రాష్ట్రవ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలు చేశారు. రెండో విడతలో భాగంగా సాయం జూలై 5న విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంకా అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఎక్కువమంది లబ్ది పొందే వీలుగా ఈ నెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం( Mega parents teachers meeting ) జరిగే రోజు.. రెండో విడత నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 10న రెండో విడత నిధులు జమ కానున్నాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అర్హత ఉండి సాంకేతిక కారణాలతో నిధులు జమ కాని లబ్ధిదారులకు సైతం.. అదే రోజు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: హాట్ టాపిక్ : జగన్ పై వాహన ప్రమాద కేసులో చర్యలన్నీ నిలిపేసిన కోర్టు
సుమారు పది లక్షల మందికి
ఇప్పటివరకు ఒకటో తరగతిలో( first class) 5.5 లక్షలు, ఇంటర్ ఫస్టియర్లో 4.7 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు వివిధ కారణాలతో తల్లికి వందనం అనర్హత జాబితాలో చేరిన వారికి గ్రీవెన్స్ లో అవకాశం కల్పించారు. వారి అభ్యర్థనను పరిశీలించారు కూడా. ఈనెల రెండు వరకు ఒకటో తరగతిలో చేరే పిల్లలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందం ఉంది. మరోవైపు ఒకటో తరగతితో పాటు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు నిధులను ఈ నెల 10న జమ చేస్తామని అధికారులు ప్రకటించారు కూడా.
స్టేటస్ తెలుసుకునే అవకాశం..
మరోవైపు పథకానికి సంబంధించి స్టేటస్ చెక్( status check) చేసుకునే వీలుగా ప్రభుత్వం కొన్ని ఆప్షన్లు ఇచ్చింది. https://gsws-nbm.ap.gov.in/ ఓపెన్ చేసి తల్లికి వందనం ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. విద్యార్థి తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ పథకానికి అర్హులా కాదా అన్న విషయం తెలిసిపోతుంది. అలాగే మన మిత్ర యాప్ ద్వారా కూడా ఇట్టే వివరాలు తెలిసిపోతాయి. మన మిత్ర వాట్సాప్ సర్వీస్ నెంబర్ 9552300009 ద్వారా తల్లికి వందనం పథకం రెండో జాబితాలో పేరు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు.