మరో సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ..!

బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మోదీ రైతులకు శుభవార్త అందించబోతున్నారు. లాక్డౌన్ కారణంగా దేశంలోని వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఇటీవల ‘వన్ నేషన్-వన్ రేషన్’ స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే సోమవారం మోదీ కేంద్ర మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో జూన్ 1న నుంచి 30వరకు లాక్డౌన్ 5.0 కొనసాగనుండటంపై చర్చించారు. అదేవిధంగా కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో […]

Written By: Neelambaram, Updated On : June 1, 2020 4:17 pm
Follow us on


బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మోదీ రైతులకు శుభవార్త అందించబోతున్నారు. లాక్డౌన్ కారణంగా దేశంలోని వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఇటీవల ‘వన్ నేషన్-వన్ రేషన్’ స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే సోమవారం మోదీ కేంద్ర మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో జూన్ 1న నుంచి 30వరకు లాక్డౌన్ 5.0 కొనసాగనుండటంపై చర్చించారు. అదేవిధంగా కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, 20లక్షల కోట్ల ప్యాకేజీ, చైనా సరిహద్దు వివాదం తదితర అంశాలపై క్యాబినేట్లో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా రైతుల కోసం కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు రైతులు పంటలు పండించటం ఒక ఎత్తయితే.. వాటిని అమ్ముకోవడం మరొక ఎత్తవుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘వన్ నేషన్.. వన్ మార్కెట్’(ఒకే దేశం-ఒక మార్కెట్)ను తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తుంది. ఈమేరకు క్యాబినెట్లో ఈ ప్రస్తావించి దీనిపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రధాని మోదీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని రైతులంతా ఎక్కడి నుంచి ఎక్కడైనా అధిక ధరకు దిగుబడులను అమ్ముకునేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురానుందని విశ్వసనీయ సమాచారం.

వన్ నేషన్.. వన్ మార్కెట్ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం దీనిపై ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేస్తుందోనని ఆసక్తి నెలకొంది. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సమయంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కూాడా రైతులకు త్వరలో ఓ గుడ్ న్యూస్ చెబుతానంటూ సస్పెన్స్ లో పెట్టారు. అయితే ప్రధాని మోదీ మాత్రం దేశంలోని రైతులందరిని దృష్టిలో ఉంచుకొని వన్ నేషన్.. వన్ మార్కెట్ తీసుకొచ్చి ముందుగానే గుడ్ న్యూస్ చెప్పడం విశేషం.