వైసీపీని చంద్రబాబు ఇలా దెబ్బకొడుతున్నాడా?

40 ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన.. ఎక్కడ.. ఎలా ఎవరిని దెబ్బకొట్టాలో బాగా తెలుసు.. చంద్రబాబు కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. అందుకే.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై కోర్టుల్లో కేసులు నిలబడవు.. కానీ ప్రత్యర్థులు మాత్రం చంద్రబాబు వలలో పడిపోతుంటారు.. దెబ్బైపోతుంటారు.. ఇప్పుడూ అదే జరిగింది. అనుభవరాహిత్యం ఉన్న జగన్ వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆడుకుంటున్నారు. వైసీపీ లీక్స్ ను తెలివిగా వాడుకుంటూ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మీడియా మేనేజ్ మెంట్ లో తనను […]

Written By: Neelambaram, Updated On : June 1, 2020 4:09 pm
Follow us on


40 ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన.. ఎక్కడ.. ఎలా ఎవరిని దెబ్బకొట్టాలో బాగా తెలుసు.. చంద్రబాబు కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. అందుకే.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై కోర్టుల్లో కేసులు నిలబడవు.. కానీ ప్రత్యర్థులు మాత్రం చంద్రబాబు వలలో పడిపోతుంటారు.. దెబ్బైపోతుంటారు.. ఇప్పుడూ అదే జరిగింది. అనుభవరాహిత్యం ఉన్న జగన్ వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆడుకుంటున్నారు. వైసీపీ లీక్స్ ను తెలివిగా వాడుకుంటూ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మీడియా మేనేజ్ మెంట్ లో తనను మించిన వాడు లేడని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు.

తాజాగా టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. టీడీపీకి సంబంధించిన వెబ్ మీడియాలో వైసీపీ లూప్ హోల్స్ పై ఆర్టికల్స్ వేయించాలని చంద్రబాబు , టీడీపీ డిసైడ్ అయ్యారట.. ఈ మేరకు టీడీపీకి సంబంధించిన వెబ్ సైట్ లలో ట్రాఫిక్ ను బట్టి రూ.3-5 వేల వరకు ఒక ఆర్టికల్ కు చెల్లించి రాయించి పోస్ట్ చేయిస్తున్నారని.. వైసీపీ హైకమాండ్ లో పెద్ద ఎత్తున వార్ జరుగుతోందని ప్రచారం చేస్తున్నారని లీకులు వస్తున్నాయి.. టీడీపీ డబ్బులు ఖర్చు పెట్టి మరీ వైసీపీ హైకమాండ్ పై వెబ్ సైట్లలో బురద జల్లుతున్నారని సమాచారం. చంద్రబాబు మీడియా మేనేజ్ మెంట్ పై సీఎం జగన్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని లేదంటే పార్టీ పరువు పోయి ప్రజల్లో చులకన అయ్యే ప్రమాదం ఉందని క్షేత్రస్థాయి వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్ ప్రభుత్వ పాలనతో బిజిబిజీగా ఉన్నారు.. కానీ వైసీపీ పార్టీ హైకమాండ్ లో కొందరు కీలక వ్యక్తులు మాత్రం చీటికి మాటీకి ఆధిపత్య పోరుతో కొట్లాటలకు దిగుతున్నారట… జగన్ ఎంత సర్దుబాటు చేసుకోమన్నా నేతలు పెడచెవిన పెడుతూ కొట్లాడుకుంటున్న తీరు ప్రతిపక్ష టీడీపికి వరంగా మారుతోందట.. ఈ కొట్లాటను రికార్డ్ చేసి ప్రధాన వెబ్ సైట్లకు డబ్బులిచ్చి మరీ టీడీపీ అభాసుపాలు చేస్తున్న వైనం వైసీపీకి షాకింగ్ గా మారిందట… వైసీపీ హైకమాండ్ లోని కొందరి వల్ల ఆయన జగన్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతోందని.. పాలనను చూస్తున్న జగన్.. పార్టీపై నజర్ వేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని వైసీపీ నేతలు వాపోతున్నారు.

వైసీపీ హైకమాండ్ లో కొట్లాట ఎంత వరకు వచ్చింది అంటే ఈ మధ్య కాలంలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏది అయినా జరిగినా.. మెల్లిగా ఆ విషయాలు, గొడవలు, వీడియోలు ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చిచేరుతున్నాయి. వెబ్ సైట్లలో హైలెట్ అవుతున్నాయి. ట్విట్టర్, ఫేస్ బుక్ లో టీడీపీ సోషల్ మీడియా వింగ్ రచ్చరచ్చ చేస్తోంది.. వైసీపీ కొట్లాట విషయాలు బహిర్గతం చేస్తూ మీడియాలో హైలెట్ చేస్తూ టీడీపీ పెద్ద దుమారం సృష్టిస్తోంది.

వైసీపీ హైకమాండ్ లో విభేదాలతో సీఎం జగన్ ను కలిసి ఫిర్యాదులు చేశారట. సీఎంకు హైకమాండ్ లోని ఇద్దరు కీలక వ్యక్తులు వెళ్లి కలిసి ఫిర్యాదు చేసినా సీఎం జగన్ వారిని అనునయించారని తెలిసింది.. పార్టీలో ఇలాంటివి సహజమని.. పార్టీలో సర్దుకుపోవాలని సీఎం సూచించారట.. పెద్దగా ఫిర్యాదులపై స్పందించలేదని సమాచారం. అయితే ఈ తంతును టీడీపీ సోషల్ మీడియా వింగ్ మాత్రం అందిపుచ్చుకొని రచ్చ రచ్చ చేస్తోంది..