తెలంగాణలో బడిగంట మోగేది అప్పుడే?

ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ 5.0 కొనసాగుతుంది. జూన్ 1న నుంచి జూన్ 30వరకు లాక్డౌన్ కొనసాగనుంది. అయితే లాక్డౌన్ 5.0లో కేంద్రం కొన్ని రంగాలకు మినహా దాదాపు అన్నింటికి సడలింపులు ఇచ్చింది. రైల్వే, విమాన, విద్యా, దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మాల్స్ వంటి వాటిపై కూడా లాక్డౌన్ 5.0లో నిర్ణయం ప్రకటించింది. జూన్ 8నుంచి దేవాలయాలు, ప్రార్థన మందిరాలను తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. మెట్రో టైన్లు, అంతర్జాతీయ విమానాలకు సడలింపులను ఇవ్వడం లేదు. ఇక విద్యారంగానికి సంబంధించి రాష్ట్ర […]

Written By: Neelambaram, Updated On : June 1, 2020 5:06 pm
Follow us on


ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ 5.0 కొనసాగుతుంది. జూన్ 1న నుంచి జూన్ 30వరకు లాక్డౌన్ కొనసాగనుంది. అయితే లాక్డౌన్ 5.0లో కేంద్రం కొన్ని రంగాలకు మినహా దాదాపు అన్నింటికి సడలింపులు ఇచ్చింది. రైల్వే, విమాన, విద్యా, దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మాల్స్ వంటి వాటిపై కూడా లాక్డౌన్ 5.0లో నిర్ణయం ప్రకటించింది. జూన్ 8నుంచి దేవాలయాలు, ప్రార్థన మందిరాలను తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. మెట్రో టైన్లు, అంతర్జాతీయ విమానాలకు సడలింపులను ఇవ్వడం లేదు. ఇక విద్యారంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు తుది నిర్ణయం ప్రకటించింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభంపై జూలైలో నిర్ణయం ప్రకటించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఇక తెలంగాణలో జులై 1నుంచి బడిగంట మోగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తొలుత జులై 1నుంచి ఉన్నత పాఠశాలలను మాత్రమే ప్రారంభిస్తారు. వీటి పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించనున్నారు. ఒక్కో తరగతిగదిలో 15మంది విద్యార్థులను అనుమతించరు. ఒక్కో తరగతిలో ఎక్కువగా విద్యార్థులుంటే షిప్ట్ పద్ధతిలో అనుమతిస్తారు. ప్రాథమిక పాఠశాలకు ఆది, సోమవారాలు సెలవు. రెండో శనివారం సెలవు ఉండదు. 8, 9, 10 తరగతి విద్యార్థులకు మాత్రం ఒక్క ఆదివారం సెలవు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తరగతులకు అనుమతించరు. ఆటలకు అనుమతించరు. భౌతిక దూరం తప్పనిసరి పాటించాలి.

పాఠశాల పనిదినాలను 150 రోజులకు విద్యాశాఖ తగ్గించింది. అేలాగే ఈ సంవత్సరం ప్రాథమిక పాఠశాల సిలబస్ 70శాతానికి తగ్గిస్తారు. పదో తరగతి పరీక్షలను ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. 2020-21 విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షలను ఏడు పేపర్లకు కుదించింది. ఒక్కో సబ్జెక్టుకు ఒకే పరీక్ష అన్నమాట. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రాగానే పాఠశాలలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది.