spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nandamuri Balakrishna: పెళ్లిళ్లు పేరంటాలకే వస్తావా బాలయ్య.. నిలదీసిన ప్రజలు.. వైరల్ వీడియో

Nandamuri Balakrishna: పెళ్లిళ్లు పేరంటాలకే వస్తావా బాలయ్య.. నిలదీసిన ప్రజలు.. వైరల్ వీడియో

Nandamuri Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు చేదు అనుభవం ఎదురైంది. సొంత నియోజకవర్గంలోనే ప్రజలు చుక్కలు చూపించారు. స్థానికులు ఆయన రాకను అడ్డుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనను ప్రజలు బాహటంగానే అడ్డుకోవడం విశేషం. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి లేదు కానీ… స్థానికంగా జరిగే శుభకార్యాలు, పండగలు, పెళ్లిళ్లకు వస్తున్నారు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు సముదాయించి అక్కడ నుంచి పంపించారు.

హిందూపురం నందమూరి కుటుంబానికి పెట్టని కోట. టిడిపి ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు, అటు తర్వాత హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో బాలకృష్ణ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఆయన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం లేదని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోసారి ఆయనకు అవకాశం ఇస్తే హిందూపురం నియోజకవర్గ అన్ని విధాలా నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయనకు చుక్కెదురు కావడం విశేషం.

సుదీర్ఘ విరామం తర్వాత బాలకృష్ణ హిందూపురంలో అడుగు పెట్టారు. దాదాపు పది నెలల అనంతరం హిందూపురం మండల టిడిపి కన్వీనర్ అశ్వత్ రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు హాజరయ్యారు. ఈ క్రమంలో కొందరు బాలకృష్ణ చుట్టుముట్టారు. ఆయన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేవలం పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి కోసం మాత్రమే నియోజకవర్గానికి వస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొద్దిపాటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సముదాయించి.. అటు ఆందోళనకారులను, ఇటు బాలకృష్ణను పంపించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version