
Nara Lokesh : తండ్రి చంద్రబాబుకు ఆ విద్య అబ్బలేదు. కొడుకు లోకేష్ కు అంతకంటే తక్కువగానే సామర్థం ఉంది. ఇంకేముంది సరిగ్గా మాటలు మాట్లాడడంలో ప్రజల ముందు నవ్వుల పాలు కాకుండా ఉండడానికి ఇప్పుడు లోకేష్ కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును ఎప్పుడు ఏ మాట తూలుతాడో తెలియని నారా లోకేష్ తాజాగా హిజ్రాల వద్ద మాట తూలాడని ఓ ప్రచారం సాగుతోంది.
ఏపీలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ బాబును తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో హిజ్రాలు కలిశారు. సమాజంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్న తమకు అండగా నిలవాలని వినతిపత్రం ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమకు ఎటువంటి జీవనోపాధి లేదని.. దారిద్ర్యంలో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.టీడీపీ ప్రభుత్వం తమకు రూ.1500 పింఛన్ ఇచ్చేదని.. ఇళ్లు లేనివారికి స్థలాలు కేటాయించిందని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తమకు పింఛన్లు నిలిపివేశారని హిజ్రాలు లోకేష్ ముందు వాపోయారు. తమకు సొంత ఇళ్లు, స్థలాలు లేవని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్లను పునరుద్దరించాలని.. ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని కోరారు.
ఈ క్రమంలోనే వారికి భరోసానిస్తూ లోకేష్ బాబు నోరుజారారు. ‘మీ కోరికలన్నీ తీరుస్తానంటూ’ వాడకూడని పదాలు వాడేశాడు. సాధారణంగా అమ్మాయిలను కోరిక తీరుస్తామంటే అది బూతు. ఇక హిజ్రాల కోరిక తీరుస్తామంటే అది తేడా. ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా లోకేష్ మాట్లాడాడంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎవరితో ఎలా మాట్లాడాలో జర లోకేష్ కు ‘కోచింగ్ ఇప్పించండ్రా’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఓరేంజ్ లో ఆడుకుంటున్నారు. హిజ్రాలు అసలే ఇలాంటి విషయంలో ఆగ్రహంగా ఉంటారు. కానీ మన లోకేష్ భాషా పటిమ చూసి నవ్వి ఊరుకున్నారట.. అదీ సంగతీ..
లోకేష్ బాబు ఏదైనా సభలో మాట్లాడితే చాలు అందులో 100 బూతులు వెతుక్కోవచ్చు. ఎన్నో తప్పుడు పదాలను కనిపెట్టవచ్చు. లోకేష్ మాట్లాడాడంటే ఆరోజు సోషల్ మీడియాకు పండుగనే మరి. ఎన్నో అపశృతులతో లోకేష్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటారు. లోకేష్ బాబుకు జనాలతో ఏం మాట్లాడాలి? ఎలా ఎప్పుడు ప్రవర్తించాలన్నది అస్సలు తెలియడం లేదట..
తాజాగా హిజ్రాలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తే అక్కడ నారా లోకేష్ ఠంగ్ స్లిప్ అయ్యారని ఓ ప్రచారం సాగుతోంది. ఇందులో నిజనిజాలు ఎంతో తెలియాల్సి ఉంది. నిజంగా లోకేష్ అన్నాడా? వైసీపీ చేస్తున్న ప్రచారమా? అన్నది చూడాలి.