కిల్లర్ మున్నా కేసు:12మందికి ఉరి.. ఆ క్రైం కథ

కరడు గట్టిన నేరస్తుడికి చివరికి ఉరి ఖరారు అయింది. నాలుగు రాష్ర్టాల పోలీసులను కంటి మీద కునుకు లేకుండా చేసిన హైవే కిల్లర్, గ్యాంగ్ స్టర్ మున్నా కేసులో ప్రకాశం న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కేసులో ప్రమేయం ఉన్న మరో 12 మందిని దోషులుగా తేల్చింది. అందరికీ ఉరిశిక్ష విధించింది. ఈమేరకు ఒంగోలు జిల్లా న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే తీర్పు చెప్పింది. ఈ మధ్య కాలంలో 12 మందికి ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి. మున్నా […]

Written By: NARESH, Updated On : May 24, 2021 6:42 pm
Follow us on

కరడు గట్టిన నేరస్తుడికి చివరికి ఉరి ఖరారు అయింది. నాలుగు రాష్ర్టాల పోలీసులను కంటి మీద కునుకు లేకుండా చేసిన హైవే కిల్లర్, గ్యాంగ్ స్టర్ మున్నా కేసులో ప్రకాశం న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. కేసులో ప్రమేయం ఉన్న మరో 12 మందిని దోషులుగా తేల్చింది. అందరికీ ఉరిశిక్ష విధించింది. ఈమేరకు ఒంగోలు జిల్లా న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే తీర్పు చెప్పింది.

ఈ మధ్య కాలంలో 12 మందికి ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి. మున్నా అసలు పేరు అబ్దుల్ సమద్. నేరప్రపంచంలో మున్నాబాయ్ హైవే కిల్లర్ గా గుర్తింపు పొందాడు. 16 మందితో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని చెన్నై-కోల్ కత జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని దారిదోపిడీలకు పాల్పడేవాడు. దోపిడీ సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని హతమార్చేవాడు.

ఈ గ్యాంగ్ లో ఎస్ కే రియాజ్, సయ్యద్ హిదయతుల్లా, మహ్మద్ జమాలుద్దీన్, బటాలా సాల్మన్, చిన్న వీరాస్వామి, భానుప్రకాశ్, సంపత్, శ్రీధర్, హఫీజ్, గంగాధర్ రావు, కమాల్ సాహెబ్, రహంతుల్లా, దాదాపీర్, ఇర్ఫాన్, రఫీ ఉన్నారు. 2008లో ఈ గ్యాంగ్ తమిళనాడుకు చెందిన రామర్ శంకర్, పెరుమాళ్ సుబ్రహ్మణ్యం, ఏపీకి చెందిన శ్యాంబాబు, వినోద్ కుమార్, బిహార్ కు చెందిన భూషణ్ యాదవ్, చందన్ కుమార్ మహతోలను హత్య చేసింది. ప్రకాశం జిల్లా పరిధిలో చెన్నై-కోల్ కత రహదారిపై ఈ హత్యలు జరిగాయి. వారిపై మొత్తం 7 కేసులు నమోదయ్యాయి.

మొత్తం 14 మందిని హత్య చేసినట్లు వారిపై కేసులు నమోదు చేశారు. వాటిపై ప్రకాశం జిల్లా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రధాన దోషి మున్నాతో సహా 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చె ప్పింది. మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ ఏడింట్లో మూడు కేసుల్లోనే ఈ గ్యాంగ్ మొత్తం దోషులుగా తేలింది. ఇంకా నాలుగు కేసులకు సంబంధించిన తీర్పులు రావాల్సి ఉంది. ప్రధానంగా ఇనుము లోడుతో వెళ్తున్న లారీలనే లక్ష్యంగా చేసుకునే వారని దర్యాప్తులో తెలిసింది. డ్రైవర్, క్లీనర్లను హత్య చేసిన అనంతరం ఇనుమును దుకాణాల్లో విక్రయించే వారని తెలిసింది. మృతదేహాలను ఇసుకలో పాతిపె ట్టేవారు.