తరువాత సినిమా కోసం దాదాపు మూడేళ్లుగా వెయిటింగ్ లో ఉన్నాడు . ఇది నాలోగో సంవత్సరం, కరోనా కారణంగా ఒక ఏడాది పోయింది అనుకున్నా.. హిట్ డైరెక్టర్ మరో సినిమా కోసం మూడేళ్లు ఎదురుచూడటం అంటే.. కచ్చితంగా నక్కిన త్రినాధరావు బ్యాడ్ లకే. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. నక్కిన చేతిలో అడ్వాన్స్ లు ఉన్నాయి, సినిమా చేయడానికి నిర్మాతలు రెడీగానే ఉన్నారు.
కానీ హీరో దొరకడం లేదు. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న గుసగుసల ప్రకారం.. నక్కిన చెప్పే కథ ఫామ్ లో ఉన్న ఏ హీరోకి ఎక్కట్లేదు. అందుకే సినిమా సెట్ కావడం లేదట. చివరకు హీరో నాగశౌర్య కూడా నక్కిన చెప్పిన కథకు నో చెప్పేశాడు. ఇప్పటికే వెంకటేష్, రామ్, వరుణ్ తేజ్, రవితేజ ఇలా టచ్ చేయని హీరో లేడు. కానీ ఏ హీరో నక్కినకి ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.
నిజానికి రవితేజతో సినిమా ఫిక్స్ అనుకున్నారు. సినిమా ఓపెనింగ్ కి కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. సహజంగా కథలో పెద్దగా ఇన్ వాల్వ్ అవ్వని రవితేజ పొరపాటున కథ అడిగాడు. చెప్పగానే సినిమానే క్యాన్సిల్ చేసుకున్నాడు. రామ్ దగ్గర కూడా ఇదే పరిస్థితి. మొత్తమ్మీద నక్కినకు ఇప్పట్లో చాన్స్ రావడం కష్టమే అన్నట్టు ఉంది పరిస్థితి.