https://oktelugu.com/

పోలవరం ప్రాజెక్టుపై నేడు ఉన్నతస్థాయి సమావేశం

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయంపై ఢిల్లీలో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి సమావేశం కానున్నారు. 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయానికి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ను ఇవ్వడంపై వారు చర్చిస్తారు. Also Read: బీజేపీని చూసి జగన్ ఎందుకు అంత భయపడుతున్నారు? 2017–18 ధరల ప్రకారం నిధులిస్తేనే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మార్గం […]

Written By: , Updated On : January 20, 2021 / 10:37 AM IST
Follow us on

Polavaram project
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయంపై ఢిల్లీలో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి సమావేశం కానున్నారు. 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయానికి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ను ఇవ్వడంపై వారు చర్చిస్తారు.

Also Read: బీజేపీని చూసి జగన్ ఎందుకు అంత భయపడుతున్నారు?

2017–18 ధరల ప్రకారం నిధులిస్తేనే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం పూర్తి స్థాయిలో ఏకీభవిస్తూ ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చాయి. దాంతో 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఖరారుచేసి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చేందుకు జల్‌శక్తి శాఖ కసరత్తు చేస్తోంది.

ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో జరిగే సమావేశానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర నీటిపారుదల శాఖ అధికారులు, ఏపీ నీటిపారుల శాఖమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు, నిపుణులు పాల్గొనున్నారు. పోలవరంపై గతవారం అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.

Also Read: అమిత్ షా – వైయస్ జగన్ గంటన్నర గూడుపుఠాణి కథేంటి?

ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియా పర్యటనకు బయల్దేరే ముందు సీఎం ఢిల్లీ వెళ్లారు. అక్కడ గడ్కారీని కలిసి పోలవరం అంశాలపై మాట్లాడాలనుకున్నారు. కానీ.. ఆయన అపాయింట్ మెంట్ దొరకలేదని సమాచారం. అయితే కొరియా పర్యటనలో ఉన్న సీఎం నేడు జరగబోయే సమావేశానికి అక్కడి నుండే మంత్రి, నీటిపారుదల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్