దిష్టి అంటే ఏమిటి.. నిజంగానే దిష్టి అనేది ఉంటుందా..!

సాధారణంగా మన ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి డీలా పడిపోయినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది, దిష్టి తీసేయండి అని చెబుతుంటారు. అసలు నిజంగానే దిష్టి అనేది ఉంటుందా? ఈ విధంగా దిష్టి తీయడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచారం అని చెప్పవచ్చు. దిష్టి తగిలినప్పుడు ఎలాంటి లక్షణాలు కనబడతాయి? దిష్టి తగిలింది అని తెలిస్తే ఏ విధంగా తీసేయాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం. Also Read: ఏలూరులో మళ్లీ […]

Written By: Navya, Updated On : January 20, 2021 11:32 am
Follow us on

సాధారణంగా మన ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి డీలా పడిపోయినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది, దిష్టి తీసేయండి అని చెబుతుంటారు. అసలు నిజంగానే దిష్టి అనేది ఉంటుందా? ఈ విధంగా దిష్టి తీయడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచారం అని చెప్పవచ్చు. దిష్టి తగిలినప్పుడు ఎలాంటి లక్షణాలు కనబడతాయి? దిష్టి తగిలింది అని తెలిస్తే ఏ విధంగా తీసేయాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Also Read: ఏలూరులో మళ్లీ వచ్చిన వింత వ్యాధి.. బాధితుల సంఖ్య ఎంతంటే..?

సాధారణంగా మహిళలు ఏదైనా శుభకార్యం జరిగినా, అంటే బారసాల, నామకరణం, పెళ్లి, శ్రీమంతం వంటి కార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన అందరి చూపు కార్యం ఎవరికైతే జరుగుతుందో వారిపై కేంద్రీకృతమై ఉంటుంది. ఆ విధంగా ఇతర వ్యక్తుల నుంచి వచ్చిన విద్యుత్ తరంగాలు ఆ వ్యక్తిని తాకినప్పుడు అవి వారి శరీరానికి వ్యతిరేఖతను కలిగించినప్పుడు ఆ వ్యక్తికి వికారం, కడుపు నొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.

Also Read: సపోటా పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

ఈ విధంగా బాధపడే వారికి మన ఇంట్లో పెద్దవారు కొద్దిగా నీటిలో పసుపు, నీళ్లు కలిపి అందులో కర్పూరం వెలిగించి దిష్టి తీసి వీధి చివర పడేస్తారు. ఈ విధంగా దృష్టిలో ఉపయోగించే ఎరుపు నీరు చూడగానే ఒక రకమైన ధైర్యం మనలో కలుగుతుంది.అంతేకాకుండా ఎరుపురంగును చూసినప్పుడు ఎలాంటి నీరసం రాకుండా ఉంటుంది కాబట్టి ఎరుపురంగు నీళ్లతో దిష్టిని తీయడం వల్ల ఆ వ్యక్తి లో కేంద్రీకృతమైన విద్యుత్ తరంగాలను ఎరుపురంగు చెడగొడుతుంది కాబట్టి వెంటనే ఆ వ్యక్తి ఎంతో ఉత్సాహంగా కనబడుతాడు.ఈ విధంగా దిష్టి తీయడం వెనుక మూఢనమ్మకం ఎంత ఉందో సైన్స్ కూడా అంతే దాగి ఉంది.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం