https://oktelugu.com/

ఆ ప్రచారం ప్రజల దాక చేరితే టీడీపీ నష్టమే..!

చంద్రబాబు.. ఏమైనా అంటే ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని అంటుంటారు. కానీ.. ఆయన తనయుడు లోకేష్‌ మాత్రం ఆయన వారసత్వాన్ని అందుకోలేకపోతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే లోకేష్‌ వల్లే చంద్రబాబుకు ఇబ్బందులు వస్తున్నాయంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నడుస్తున్న టాక్‌. ఎన్నికలు ఇప్పుడప్పుడే లేవు. జమిలి ఎన్నికలు వచ్చినా రెండేళ్ల సమయం ఉంది. చంద్రబాబు ఇప్పుడే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించారు. పార్టీలో ఉత్తేజం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. Also Read: బీజేపీని చూసి జగన్ ఎందుకు అంత భయపడుతున్నారు? అయితే.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 20, 2021 10:31 am
    Follow us on

    TDP
    చంద్రబాబు.. ఏమైనా అంటే ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అని అంటుంటారు. కానీ.. ఆయన తనయుడు లోకేష్‌ మాత్రం ఆయన వారసత్వాన్ని అందుకోలేకపోతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే లోకేష్‌ వల్లే చంద్రబాబుకు ఇబ్బందులు వస్తున్నాయంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నడుస్తున్న టాక్‌. ఎన్నికలు ఇప్పుడప్పుడే లేవు. జమిలి ఎన్నికలు వచ్చినా రెండేళ్ల సమయం ఉంది. చంద్రబాబు ఇప్పుడే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించారు. పార్టీలో ఉత్తేజం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

    Also Read: బీజేపీని చూసి జగన్ ఎందుకు అంత భయపడుతున్నారు?

    అయితే.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తనకు ఇదే చివరి ఛాన్స్ అని ప్రజలను కోరే అవకాశం ఉంది. కానీ.. చంద్రబాబు అధికారంలోకి రావడానికి లోకేష్ అడ్డంకిగా మారనున్నారట. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లోనే అప్పుడే మొదలైంది. అందుకే లోకేష్‌ను నాయకుడిగా బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రజల్లో నిత్యం ఉండాలని దిశానిర్దేశం చేశారు.

    అందులో భాగంగానే.. ఈ మధ్య లోకేష్ కూడా ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు. అయితే చంద్రబాబు అంటే ప్రజల్లో కొంత నమ్మకం ఉంది. ఇచ్చిన హామీలను నెరవేరుస్తారన్న నమ్మకం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళతారని ఇప్పటికీ కొందరు నమ్ముతారు. చంద్రబాబు విజన్ పట్ల అపారమైన విశ్వాసం ఉన్న వారు ఇప్పటికీ అనేక మంది ఉన్నారు. వయసురీత్యా, అనుభవం దృష్ట్యా చంద్రబాబు అయితే ఏపీకి మంచి జరుగుతుందని భావించే మేధావి, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. అయితే.. వయసురీత్యా చంద్రబాబు గెలిచినా ఏడాదికి మించి ముఖ్యమంత్రిగా ఉండరన్న ప్రచారం సోషల్ మీడియాలోనూ నడుస్తోంది. దీంతో అనుకూల మీడియాలోనూ లోకేష్ ను భావినాయకుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం ప్రారంభమయింది.

    Also Read: అమిత్ షా – వైయస్ జగన్ గంటన్నర గూడుపుఠాణి కథేంటి?

    చంద్రబాబు సైతం ఇప్పటికే పార్టీ బాధ్యతలను లోకేష్‌కు అప్పగించారు. వయసు రీత్యా కూడా బాబుకు విశ్రాంతి అవసరం. ఇక లోకేష్ విషయంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. అయితే.. మరోసారి టీడీపీ విజయం సాధిస్తే లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది కాస్త ప్రజల్లోకి వెళితే టీడీపీకి మరోసారి గట్టి దెబ్బతగులుతుందంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్