Modi: ప్రస్తుతం మోడీ అమెరికా పర్యటన(Modi in America tour)లో ఉన్నారు. ట్రంప్ (Trump) రెండవసారి అధ్యక్షుడైన తర్వాత మోడీ మొట్టమొదటిసారిగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయన అమెరికా భద్రతా సలహాదారు, ఇతర కీలక సిబ్బందిని కలిశారు. అనేక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడుల కీలక సూత్రధారి రాణా ను మన దేశానికి తిరిగి రప్పించడంలో విజయవంతమయ్యారు. అంతరిక్షం, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రవాణా, వస్తు సేవలు వంటి రంగాలలో పెట్టుబడులు, వ్యూహాత్మక వాణిజ్యం వంటి రంగాలలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నరేంద్ర మోడీ ముందే ట్రంప్ వాణిజ్య వస్తువుల పై విధిస్తున్న టారిఫ్ పై పరుషమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ.. మోడీ ఏమాత్రం స్పందించలేదు. పైగా దానిని సమర్థవంతంగా తిప్పి కొట్టడానికి ప్రయత్నించారు. ట్రంప్ మనసు మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ట్రంప్ వెనక నిలబడ్డాడు
బ్లెయిర్ హౌస్ లో ట్రంప్, మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ముందుగా నరేంద్ర మోడీ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు..ఆ సమయంలో ట్రంప్ మోడీ కూర్చున్న కుర్చీ వెనక నిలబడ్డారు. మోడీ సంతకాలు చేస్తున్నంత సేపూ అలానే ఉన్నారు. మోడీ సంతకాలు చేయడం పూర్తయిన తర్వాత.. మోడీ కూర్చున్న కుర్చీని జాగ్రత్తగా వెనక్కి లాగారు. ఒక అమెరికా అధ్యక్షుడు భారత ప్రధాని విషయంలో ఇంతటి గౌరవాన్ని, తగ్గి ఉండే తత్వాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి. కేవలం భారత్ విషయంలోనే కాదు.. ప్రపంచంలో ఏ దేశాధినేతలకు కూడా ఒక అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో గౌరవాన్ని ఇవ్వలేదు. మోడీ బలమైన నాయకుడు కాబట్టే ట్రంప్ ఆ స్థాయిలో మర్యాదలు ఇచ్చారని..మోడీ విలువ తెలుసుకాబట్టే వెనక నిలబడ్డారని.. ఇంతకుమించి మోడీ శక్తివంతమైన నాయకుడు అని చెప్పడానికి బలమైన ఆధారాలు ఇంకేమి కావాలని భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు..” బలహీనమైన దేశం నుంచి.. బలమైన దేశంగా భారత్ ను నరేంద్ర మోడీ తీసుకెళ్తున్నారు. విప్లవాత్మక మార్పుల ద్వారా దేశంలో సరికొత్త అభివృద్ధిని చేస్తున్నారు. అందువల్లే అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. ప్రపంచ స్థాయిలో మోడీ వల్లనే భారత్ పరపతి పెరిగింది. ఇకపై కూడా పెరుగుతుంది. అరబ్ నుంచి మొదలు పెడితే అమెరికా వరకు ప్రతి దేశం ఇప్పుడు భారత్ ను గుర్తిస్తోంది. ఇదంతా కూడా నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమైంది. అతని నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని” బీజేపీ నాయకులు అంటున్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. వివిధ ఒప్పందాల పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కుర్చీ నుంచి లేస్తుండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మర్యాదగా దాన్ని వెనక్కి లాగారు. #NarendraModi #DonaldTrump #ModiInUSA pic.twitter.com/QEfZbF7AjU
— Anabothula Bhaskar (@AnabothulaB) February 14, 2025