https://oktelugu.com/

కాంగ్రెస్ కు షాకిచ్చిన పెద్దాయన..!

మాజీ ప్రధాని దేవగౌడ వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇటీవల కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ ప్రకటించారు. ఇందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధం కావాలని సూచించారు. ప్రస్తుతం కర్ణాటకలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. దేవగౌడతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు విషయంలో మద్దతు ఇచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జెడీఎస్-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని అందరూ భావించారు. అయితే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2020 / 04:12 PM IST
    Follow us on

    మాజీ ప్రధాని దేవగౌడ వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇటీవల కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ ప్రకటించారు. ఇందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధం కావాలని సూచించారు. ప్రస్తుతం కర్ణాటకలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. దేవగౌడతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు విషయంలో మద్దతు ఇచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జెడీఎస్-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని అందరూ భావించారు. అయితే తాజాగా ఆయన కాంగ్రెస్ కు షాకిచ్చేలా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: ఆపరేషన్ ‘కుప్పం’ మొదలైందిగా?

    కర్ణాటక రాజకీయాల్లో జేడీఎస్ పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కన్పిస్తుంది. కర్ణాటకలో ఎప్పుడు హంగ్ వచ్చిన జేడీఎస్ పార్టీదే హవా నడుస్తుంది. ప్రతీ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేసి కింగ్ మేకర్ గా మారడం జేడీఎస్ ప్రత్యేకత. హంగ్ ఏర్పడిన ప్రతీసారి దేవగౌడ తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలను రచిస్తూ ముందుకెళుతుంటారు. కిందటి ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కంటే అతితక్కువ సీట్లు దక్కించుకున్న జేడీఎస్ పార్టీ ముఖ్యమంత్రి సీటు దక్కించుకుంది. దేవగౌడ కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని తన కుమారుడు కుమారస్వామిని సీఎం సీట్లో కూర్చోబెట్టారు. అయితే కాంగ్రెస్ అనైక్యత, బీజేపీ వ్యూహంతో కొద్దిరోజుల్లోనే కుమారస్వామి ప్రభుత్వం పడిపోయింది.

    ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో దేవెగౌడ కాంగ్రెస్ పార్టీతో నేరుగా పొత్తు కుదుర్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం దేవెగౌడ కుటుంబంపై పడింది. కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల్లో సహకరించక పోవడంతో దేవగౌడతోపాటు ఆయన మనవడు నిఖిల్ గౌడ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పొత్తు కారణంగా సొంత పార్టీ క్యాడర్ కూడా హ్యాండిచ్చిందని దేవగౌడ లెక్కలు వేసుకున్నారు. అనంతరం కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదంటూ స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు.

    Also Read: మంత్రులకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్..!

    అయితే ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో దేవెగౌడకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో మళ్లీ కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆయన మాత్రం కార్యకర్తలకు అలాంటిదేమీ లేదనే సంకేతాలను పంపుతున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వల్లే జేడీఎస్ భారీగా నష్టపోయిందని గుర్తు చేసుకుంటున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తేల్చి చెబుతున్నారట. ఈమేరకు పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇస్తున్నారట. వచ్చే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు పెద్దాయన షాకివ్వడంతో ఆపార్టీ ఏం చేస్తుందనే ఆసక్తికరంగా మారింది.