https://oktelugu.com/

‘రైడ్‌’కు రెడీ అవుతున్న నాగార్జున!

వయసు మీద పడుతున్నా టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున జోరు తగ్గడం లేదు. కుర్రాళ్లతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఎప్పట్లాగే కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూ వెరైటీ కథలతో ముందుకెళ్తున్నాడు. రీసెంట్‌గా తన పంథా మార్చుకున్నాడు నాగ్. రెగ్యులర్ స్టోరీస్‌కు భిన్నంగా వైవిధ్యం ఉన్న సినిమాలకే మొగ్గు చూపుతున్నాడు. రాజుగారి గది 2, ఆఫీసర్, దేవదాస్‌ ఆ కోవకు చెందినవే. రీసెంట్‌గా మన్మధుడు 2తో బోల్డ్‌ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అది మరీ బోల్డ్‌గా ఉండడంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2020 10:19 pm
    Follow us on

    IT Raid remake

    వయసు మీద పడుతున్నా టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున జోరు తగ్గడం లేదు. కుర్రాళ్లతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఎప్పట్లాగే కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూ వెరైటీ కథలతో ముందుకెళ్తున్నాడు. రీసెంట్‌గా తన పంథా మార్చుకున్నాడు నాగ్. రెగ్యులర్ స్టోరీస్‌కు భిన్నంగా వైవిధ్యం ఉన్న సినిమాలకే మొగ్గు చూపుతున్నాడు. రాజుగారి గది 2, ఆఫీసర్, దేవదాస్‌ ఆ కోవకు చెందినవే. రీసెంట్‌గా మన్మధుడు 2తో బోల్డ్‌ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అది మరీ బోల్డ్‌గా ఉండడంతో ఆడియన్స్‌ మెప్పు పొందలేకపోయింది. ఇప్పుడు కరణ్‌ జోహార్ ప్రొడ్యూస్‌ చేస్తున్న హిందీ యాక్షన్‌ ఫాంటసీ ఫిల్మ్‌ ‘బ్రహ్మాస్త్ర’లో అమితాబ్‌ బబ్చన్‌, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి నాగ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే, తెలుగులో ‘వైల్డ్‌ డాగ్‌’ అనే మూవీ చేస్తున్నాడు. సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో టాలీవుడ్‌ కింగ్‌… ఎన్‌ఐఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేయాల్సివుంది. దీని తర్వాత ఓ వెరైటీ మూవీలో నటించాలని నాగ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. తాను మనసుపడ్డ హిందీ మూవీ ‘రైడ్‌’ను తెలుగులో రీమేక్‌ చేయాలని అనుకుంటున్నాడు.

    Also Read: హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో కాజల్‌!

    అజయ్‌ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన రైడ్‌ 2018లో రిలీజై సూపర్ హిట్‌ అయింది. 1980ల్లో ఇండియాలో జరిగిన ఐటీ రైడ్స్‌ ఆధారంగా 45 కోట్లతో తీసిన ఈ మూవీ ఏకంగా 150 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ మూవీ తెలుగు రీమేక్‌లో అజయ్‌ దేవగణ్‌ పాత్రను చేయాలని నాగ్‌ భావిస్తున్నాడు. ఈ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీర్చిదిద్ది తెరకెక్కించే దర్శకుడి కోసం వెతుకుతున్నాడు నాగ్. లాక్‌డౌన్‌ టైమ్‌లో వచ్చిన బ్రేక్‌ లో ఈ మూవీని పట్టాలెక్కించేందుకు బ్యాగ్రౌండ్‌ వర్క్‌ చేశాడట‌. అలాగే, సీనియర్ దర్శకులు కాకుండా ఓ యంగ్ డైరెక్టర్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్‌లో ఈ మధ్య యువ దర్శకుల హవా నడుస్తోంది. చాలా మంది కొత్త డైరెక్టర్స్‌ తమ టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకున్నారు. మరి, నాగ్‌ను డైరెక్ట్‌ చేసే చాన్స్‌ వారిలో ఎవరికి దక్కుతుందో చూడాలి.