https://oktelugu.com/

మీ కృషికి చేతులెత్తి నమస్కరిస్తున్నా: చిరంజీవి

ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా తానా ఆధ్వర్యంలో ఈ మహోత్సవం నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సారి ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీ నుంచి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ భారీ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో ఇప్పటికే 12వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 25, 2020 8:41 pm
    Follow us on

    World Telugu Cultural Festival
    ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా తానా ఆధ్వర్యంలో ఈ మహోత్సవం నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ సారి ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీ నుంచి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ భారీ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో ఇప్పటికే 12వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 300 జూమ్‌ యాప్‌ సెంటర్ల ద్వారా ఈ లైవ్‌ ఈవెంట్‌ను నిర్విహిస్తున్నారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కరోనా టైమ్‌లో కూడా ఆగకుండా కృషి చేస్తోంది తానా.

    Also Read: ‘రైడ్‌’కు రెడీ అవుతున్న నాగార్జున!

    ఈ మహోత్సవం విజయవంతం కావాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రవాస తెలుగువారు చేస్తున్న కృషిని ఆయన కొనియాడుతూ చిరు ఓ వీడియో సందేశం ఇచ్చారు. ‘ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన, బలపడిన తెలుగువారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా మీరందరూ ప్రవాస జీవితం గడుపుతున్నప్పటికీ తెలుగు భాష, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల ఔన్నిత్యం పట్ల మీకున్న చెక్కుచెదరని అభిమానానికి నా అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికులు మాట్లాడే భాషల్లో 15వ స్థానంలో… మన భారత దేశంలో హిందీ, బెంగాలీ తర్వాత మూడో స్థానంలో.. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అమెరికాలో హిందీ, గుజరాతీ తర్వాత మూడో స్థానంలో ఉంది మన తెలుగు. అలాంటి తెలుగు భాష, తెలుగు సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణ కోసం తానా ఆధ్వర్యంలో దాదాపు 100 దేశాల్లోని తెలుగు సంస్థలు ఒకే తాటిపైకి తెచ్చి జూలై 24 నుంచి 26వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరం.

    Also Read: హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో కాజల్‌!

    కొందరు తెలుగు భాషా ప్రేమికుల పోరాట ఫలితంగా ప్రాచీన హోదాను సాధించినటువంటి తెలుగు భాషయొక్క సాధికరికతను, విశిష్ఠతను కొనసాగించాలంటే ఇలాంటి భాషా సాంస్కృతిక సమ్మేళనాలు చాలా అవసరం. స్వదేశంలో దేశ భాషలందు తెలుగు లెస్స అని… ప్రపంచ దేశాలలో ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రశంసలు అందుకున్న భాష సౌందర్యానికి ప్రణమిల్లుతూ ఈ కరోనా కష్ట కాలంలో కూడా తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయ విలువలను ముందు తరాల వారికి అందించేందుకు చేస్తున్న మీ కృషికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ మూడు రోజుల కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆశిస్తున్నా’ అని చిరంజీవి ఆకాంక్షించారు.

    https://twitter.com/MegaPowerSena/status/1286193680701771776