spot_img
Homeఆంధ్రప్రదేశ్‌నెరవేరని జగన్ కల.. నిమ్మగడ్డకు లైన్ క్లియర్

నెరవేరని జగన్ కల.. నిమ్మగడ్డకు లైన్ క్లియర్

HC
ఏపీలో పెండింగులో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎట్టి పరిస్థితితుల్లోనూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హయాంలోనే జరిపించాలన్న వైసీపీ ప్రభుత్వ ప్రయత్నాలు నెరవేరలేదు. పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా నిమ్మగడ్డకు ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వంతో పాటు ఎస్ఈసీ నిమ్మగడ్డకూ ఆదేశాలు ఇచ్చింది. హై కోర్టు తీర్పుతో పరిషత్ ఎన్నికల నిర్వహణలో ఇప్పట్లో లేదని తేలిపోయింది. నిమ్మగడ్డకు రిటైర్మెంట్ కు సైతం లైన్ క్లియర్ అయ్యింది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వైసీపీ సర్కారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ హయాంలోనే ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ పోరు జరపాలని వైసీపీ భావించింది. అయితే ఇందుకు పరిస్ధితులు మాత్రం సహకరించలేదు. గతంలో ఆపిన చోట నుంచి ఎన్నికలు తిరిగి నిర్వహించే విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉండటం, విపక్షాలు వ్యతిరేకిస్తున్న తరుణంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్ధితి. అయితే పరిషత్ పోరు నిర్వహించకుండా సెలవుపై వెళ్తున్నారంటూ.. నిమ్మగడ్డకు వ్యతిరేకాం ప్రభుత్వం దాఖలు చేయించిన పిటిషన్లకు హైకోర్టు నుంచి ఎదురు దెబ్బ తప్పలేదు.

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని ఎస్ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ.. దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఎన్నికలు జరిపించాల్సిందేనంటూ ఎస్ఈసీ ని ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. దీంతో ఈ నెలాఖరులోపు పరిషత్ పోరు నిర్వహించేలా నోటిఫికేషన్ ఇప్పించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు వృథా అయ్యాయి. నిమ్మగడ్డ హయాంలోనే పరిషత్‌ పోరు జరగాల్సిందేన్న ప్రభుత్వ వాదనకు హైకోర్టు ఒప్పుకోకపోవడంతో ఇక ఆయన తర్వాత వచ్చే ఎస్ఈసీతోనే ఈ ఎన్నికలు జరపాల్సిన పరిస్ధితి.

పరిషత్ ఎన్నికలు నిర్వహించకుండా.. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎలా రిటైర్డ్ అవుతారో చూస్తామనేలా ప్రభుత్వ పెద్దలు.. మంత్రులు నిన్న మొన్నటి వరకు వాదనలు చేశారు. అయితే హై కోర్టు తాజా ఉత్తర్వులతో పాటు ఈ కేసు విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా పడిపోవడంతో ఇక నిమ్మగడ్డ హయాంలో పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన ఈనెల 31న పదవీ విరమణ చేస్తారు. ఒకవేళ పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఉత్వర్వులు ఇచ్చినా.. ఆయన ఆగమేఘాలమీద ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా జరగకపోవడంతో నిమ్మగడ్డ రిటైర్మెంట్ కు లైన్ క్లియర్ అయినట్లు చెప్పవచ్చు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper
Exit mobile version