జగన్ ను ఇరుకున పెట్టిన కేసీఆర్..

ప్రజా పాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి రూటే సపరేటు. ఏదీ అడిగిన వెంటనే ఒప్పుకోడు… దానికి మెలికలు పెడుతుంటాడు.. అతడిపై విమర్శలు గుప్పించేలా తానే చేసుకుంటాడు… నిరీక్షించి.. నీరసం వచ్చేలా చేస్తాడు.. అదను చూసి వరాల జల్లు కురిపిస్తాడు. తిట్టిన నోళ్లతోనే జేజేలు కొట్టిస్తాడు. ధర్నాలు చేసిన వాళ్లతో క్షీరాభిషేకాలు చేయించుకుంటాడు. వీడేం మనిషిరా బాబూ.. అన్నవారితోనే సీఎం కేసీఆర్ దేవుడు అనేలా చేస్తాడు… అదీ కేసీఆర్ అంటే.. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల ఫిట్ మెంట్ , పదవీ […]

Written By: Srinivas, Updated On : March 24, 2021 11:11 am
Follow us on


ప్రజా పాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి రూటే సపరేటు. ఏదీ అడిగిన వెంటనే ఒప్పుకోడు… దానికి మెలికలు పెడుతుంటాడు.. అతడిపై విమర్శలు గుప్పించేలా తానే చేసుకుంటాడు… నిరీక్షించి.. నీరసం వచ్చేలా చేస్తాడు.. అదను చూసి వరాల జల్లు కురిపిస్తాడు. తిట్టిన నోళ్లతోనే జేజేలు కొట్టిస్తాడు. ధర్నాలు చేసిన వాళ్లతో క్షీరాభిషేకాలు చేయించుకుంటాడు. వీడేం మనిషిరా బాబూ.. అన్నవారితోనే సీఎం కేసీఆర్ దేవుడు అనేలా చేస్తాడు… అదీ కేసీఆర్ అంటే.. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల ఫిట్ మెంట్ , పదవీ విరమణ విషయంలోనూ అదే చేశాడు.

Also Read: సాగర్ లోనూ ‘తీన్మార్’ మోగించడమేనా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి పీఆర్సీ చాలా ఎక్కువగా ఉండాలని ఉద్యోగులు అంతా కోరుకున్నారు. కమిటీ అనంతరం కేవలం 11శాతం పీఆర్సీకి సిపారసు చేశారు. దీనిపై ఉద్యోగల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. పలుమార్లు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళనలు.. ధర్నాలు చేపట్టారు. తరువాత ఇంతలో అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి. 30 శాతం పీఆర్సీ అమలు చేస్తూ.. సోమవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవదులు లేవు. దీనికి బోసస్ గా రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచడంతో క్షీరాభిషేకాలు.. జేజేలు జోరుగా సాగాయి.

Also Read: వాణీదేవికి మరో వరం?.. కేసీఆర్‌‌ ఆలోచన కూడా అదేనా..

అయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దీనిపై ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి జగనుపై ఒత్తిడి పెంచే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఇప్పుడు ఉద్యోగులు సానుకూలంగానే ఉన్నా.. ఆయన వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఇంకా అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఉద్యోగులు కొన్నికొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు జగన్ దృష్టి పెడుతారా..? లేదా అనేది స్పష్టత రావడం లేదు. అయితే తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. సరే రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ నెరవేరుస్తూ.. వస్తున్నారు. ఏపీలోనూ ఇదే విధంగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో జగన్ ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి మరి.

అయితే ఇప్పుడు వచ్చే నెలలో ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో నిర్ణయం వారికి అనుకూలంగా లేకపోతే.. నిరసన దీక్షలు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని ప్రచారం జరుగుతోంది. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారని.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.. కాబట్టి.. ఏపీ విషయంలోనూ.. జగన్ కొన్ని కొన్ని హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. సీపీఎస్ రద్దు.. విషయంలో జగన్ ముందుకు వెళ్లాలని ఉద్యోగులు కోరుతున్నారు.