ఆ మూడు సినిమాల క‌లెక్ష‌న్‌.. మ‌రీ ఇంత దారుణ‌మా?

టాలీవుడ్లో ఈ వారం (మార్చి 19) మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ఒక‌టి విష్ణు ‘మోస‌గాళ్లు’, రెండోది కార్తికేయ ‘చావుక‌బురు చ‌ల్ల‌గా’, మూడోది ఆది ‘శ‌శి’. ఈ విజ‌యం ద్వారా ఫెయిల్యూర్స్ కు అడ్డుక‌ట్ట వేసి, స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు ఈ ముగ్గురు హీరోలు. కానీ.. ఈ మూడు చిత్రాల్లో ఏ ఒక్క‌టి కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదనే టాక్ వ‌చ్చింది. దీంతో క‌లెక్ష‌న్లపై భారీగా ప్ర‌భావం ప‌డింద‌ని చెబుతున్నారు ట్రేడ్ అన‌లిస్టులు. మోస‌గాళ్లు, […]

Written By: Bhaskar, Updated On : March 23, 2021 1:14 pm
Follow us on


టాలీవుడ్లో ఈ వారం (మార్చి 19) మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ఒక‌టి విష్ణు ‘మోస‌గాళ్లు’, రెండోది కార్తికేయ ‘చావుక‌బురు చ‌ల్ల‌గా’, మూడోది ఆది ‘శ‌శి’. ఈ విజ‌యం ద్వారా ఫెయిల్యూర్స్ కు అడ్డుక‌ట్ట వేసి, స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు ఈ ముగ్గురు హీరోలు. కానీ.. ఈ మూడు చిత్రాల్లో ఏ ఒక్క‌టి కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదనే టాక్ వ‌చ్చింది. దీంతో క‌లెక్ష‌న్లపై భారీగా ప్ర‌భావం ప‌డింద‌ని చెబుతున్నారు ట్రేడ్ అన‌లిస్టులు.

మోస‌గాళ్లు, చావుక‌బురు చ‌ల్ల‌గా చిత్రాల‌కు మంచి ప్ర‌మోష‌నే ద‌క్కింది. కానీ.. స్క్రీన్ పై మాత్రం ఫ‌లితం ద‌క్కిన‌ట్టు క‌నిపించ‌ట్లేదు. క‌థ‌నంపై స‌రిగా దృష్టి సారించ‌కుండా.. టెక్నిక‌ల్ అంశాల మీద‌నే దృష్టి పెట్ట‌డం మోస‌గాళ్ల‌కు మైన‌స్ అయ్యిందంటున్నారు. ఇంకా.. తెలుగు నేటివిటీ మిస్స‌వ‌డం కూడా కార‌ణ‌మేన‌ని టాక్‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో వ‌స్తుంద‌ని ఊరించిన కార్తికేయ మూవీ కూడా.. చ‌ప్ప‌గా ఉంద‌నే టాక్ స్ప్రెడ్ అయ్యింది. టేకింగ్ బాగానే ఉంద‌నే మాట వినిపించిన‌ప్ప‌టికీ.. జ‌నాలు ఇంట్ర‌స్ట్ చూపించ‌ట్లేదు. ఇక‌, ఆది ‘శ‌శి’ మరింత ఇబ్బంది పెట్టిందని అంటున్నారు. రొటీన్ యవ్వారంతో విసుగెత్తించిందనే టాక్ వ‌చ్చింది.

ఈ ప్ర‌చారంతో సినిమా వ‌సూళ్ల‌పై భారీగా ప్ర‌భావం ప‌డింది. మోస‌గాళ్లు రూ.20 కోట్ల టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. కానీ.. నాలుగు రోజుల వ‌సూళ్లు చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కేవ‌లం రెండు కోట్ల షేర్‌ కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఈ సినిమా హిట్ కొట్టాలంటే ఇంకా 19 కోట్ల షేర్ రావాలి. ఈ ప‌రిస్థితులు ఇది అసాధ్యంగా క‌నిపిస్తోంది. మ‌రి, లాంగ్ ర‌న్ లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

చావుక‌బురు చ‌ల్ల‌గా బిజినెస్ రూ.13 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. దీంతో.. 13.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యిందీ చిత్రం. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్ గా కేవ‌లం రూ.3 కోట్లు షేర్ అందుకుంది. ఇందులో మొద‌టి రోజే రూ.1.58 కోట్ల షేర్ తో ప్ర‌భావం చూపిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత వేగంగా ప‌డిపోతూ వ‌చ్చింది. నాలుగ‌వ రోజు కూవ‌లం రూ.21 ల‌క్ష‌లు సాధించింది. ఈ సినిమా విజ‌యం సాధించాలంటే.. ఇంకా రూ.10 కోట్లు రాబ‌ట్టాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఉన్న టాక్ తో ఇది ఏమేర‌కు సాధ్యం అవుతుంద‌న్న‌ది చూడాల్సి ఉంది.

ఇక‌, ఆది సాయికుమార్ శ‌శి వ‌సూళ్లు ఇంకా దారుణంగా ఉన్నాయి. నాలుగు రోజుల్లో క‌లిపి ఈ సినిమాకి కేవ‌లం రూ.34 ల‌క్ష‌‌లు వ‌చ్చాయి. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రాఫిట్ లోకి రావాలంటే ఇంకా రూ.3 కోట్ల పైచిలుకు వ‌సూలు చేయాల్సి ఉంది. ఇది సాధ్య‌మ‌వుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. లాంగ్ ర‌న్ లో ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి నంబ‌ర్స్ తో నిష్క్ర‌మిస్తాయో చూడాలి.