మరోసారి సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్..!

సీఎం కేసీఆర్ ఏ ముహూర్తానా తెలంగాణలో కొత్త సచివాలయం భవనాన్ని నిర్మించాలని భావించారో కానీ ఆ పనికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నారు. సీఎంగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాక తెలంగాణలో ఆధునాతన హంగులతో నూతన సచివాలయాన్ని నిర్మించాలని భావించారు. ఈమేరకు సచివాలయ భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం కోసం రూ.500కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు, పలు ప్రజాసంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ […]

Written By: Neelambaram, Updated On : July 10, 2020 2:56 pm
Follow us on


సీఎం కేసీఆర్ ఏ ముహూర్తానా తెలంగాణలో కొత్త సచివాలయం భవనాన్ని నిర్మించాలని భావించారో కానీ ఆ పనికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నారు. సీఎంగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాక తెలంగాణలో ఆధునాతన హంగులతో నూతన సచివాలయాన్ని నిర్మించాలని భావించారు. ఈమేరకు సచివాలయ భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం కోసం రూ.500కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు, పలు ప్రజాసంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ చివరి వారంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం పనులు షూరు చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో సచివాలయాన్ని కూల్చివేసేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈమేరకు ప్రభుత్వం ఆయా కంపెనీలకు పనులను అప్పగించడంతో మూడురోజులుగా కూల్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి. సచివాలయం వైపుకు వెళ్లే వాహనాలను దారిమళ్లించి పోలీస్ బందోబస్తు మధ్య పనులు సాగుతోన్నాయి. దీంతో ఇప్పటికే 60శాతం మేరకు కూల్చివేత పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ పనులకు హైకోర్టు బ్రేక్ వేసింది.

సచివాలయం కూల్చివేతను నిలిపివేయాలని నగరానికి చెందిన సామాజికవేత్త పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం జూలై 13(సోమవారం) వరకు సచివాలయ భవనాన్ని కూల్చొద్దంటూ మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికే సచివాలయం కూల్చివేత పనులు చాలావరకు పూర్తయినట్లు తెలుస్తోంది.

జగన్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్న అధికారుల చేతివాటం

ఇటీవలే కొత్త సచివాలయ డిజైన్ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.500కోట్లతో భవన నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం చకచక పనులు చేపడుతూ ముందుకెళుతోంది. ఈమేరకు శ్రావణ మాసంలో కొత్త సచివాలయ పనులను ప్రారంభించాలని భావిస్తున్న తరుణంలో సడన్ గా హైకోర్టు పనులకు బ్రేక్ వేయడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణానికి ప్రతీసారి అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఎలా ముందుకెళుతారో వేచి చూడాల్సిందే..!