https://oktelugu.com/

బాబుకు సినిమా చూపిస్తానంటున్న విసారెడ్డి..!

  వైసీపీ ప్రభుత్వంపై నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానమిస్తూ…రాజ్య సభ సభ్యడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ టీడీపీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. ట్రైలర్ కే అదిరిపోతే ఎట్లా రానున్న నాలుగేళ్లలో సినిమా చూపిస్తాం అని ఆయన చేసిన ట్వీట్, టీడీపీ నేతలకు హెచ్చరికలుగా తోస్తున్నాయి. అనుభవజ్ఞుడని అధికారం ఇస్తే స్కాములతో దోచుకున్నారని, అవినీతి పరులంతా జైలుకు వెళ్ళవలసిందే అని తన ట్వీట్ లో పొందుపరిచారు. విజయ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 10, 2020 / 03:12 PM IST
    Follow us on

     

    వైసీపీ ప్రభుత్వంపై నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానమిస్తూ…రాజ్య సభ సభ్యడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ టీడీపీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. ట్రైలర్ కే అదిరిపోతే ఎట్లా రానున్న నాలుగేళ్లలో సినిమా చూపిస్తాం అని ఆయన చేసిన ట్వీట్, టీడీపీ నేతలకు హెచ్చరికలుగా తోస్తున్నాయి. అనుభవజ్ఞుడని అధికారం ఇస్తే స్కాములతో దోచుకున్నారని, అవినీతి పరులంతా జైలుకు వెళ్ళవలసిందే అని తన ట్వీట్ లో పొందుపరిచారు. విజయ సాయి ట్వీట్స్ కేవలం టీడీపీ ఆరోపణలకు సమాధానం తప్ప, దీనిని అంతగా సీరియస్ గా తీసుకోవలసిన పనిలేదు అనుకుంటే పొరపాటే. రాష్ట్రంలో కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న వారికి విజయ సాయి రెడ్డి మళ్ళీ ఎవరికో స్కెచ్ వేశాడనిపించక మానదు.

    మంత్రి పదవీపై ఆశలు పెంచుకుంటున్న స్పీకర్..!

    ఇప్పటికే రాష్ట్రంలో అనేకమంది టీడీపీ నాయకుల అరెస్టులు జరిగాయి. చింతమనేని ప్రభాకర్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు మరియు కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి బడానేతలను అరెస్ట్ చేయం జరిగింది. ఈ అరెస్టులపై టీడీపీ నేతలు ఎంతగా గగ్గోలు పెట్టినా, ఏపీ ప్రభుత్వం అలానే ముందుకు పోతుంది. చివరకు బీసీ నేతల అరెస్టును, బీసీల అణచివేతలో భాగమే అని చంద్రబాబు మరియు ఆయన తనయుడు లోకేష్ బాబు నొక్కి వక్కాణించినా, జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దానికితోడు బీసీ సంఘాలు కూడా నేరారోపణలున్న బీసీ నేతల తరుపున నిలబడేది లేదని చెప్పడం బాబు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది.

    టీడీపీ ట్రాప్లో వైసీపీ నేతలు పడ్డారు?

    టీడీపీ నేతల అరెస్టుల పట్ల ప్రజల్లో సానుభూతి, వ్యతిరేకత తీసుకువచ్చి భవిష్యత్ అరెస్టులకు అడ్డుకట్ట వేయాలని బాబు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి హెచ్చరికలు తేలికగా తీసుకోలేని పరిస్థితి. ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఎంతటి నేతనైనా అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. మరి ఈ ప్రక్రియ కొనసాగితే రానున్న నాలుగేళ్లలో టీడీపీ నేతలకు నిజంగానే సినిమా కనిపించడం ఖాయం. అందుకే జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేసే పథక రచనలో బాబు ఉన్నారు. జగన్ ని దేవుడు కూడా ఆపలేడు మోడీ తప్ప అని జేసీ దివాకర్ రెడ్డి చెప్పిన మాట, గుర్తు చేసుకుంటున్న బాబుకి, మోడీ కటాక్షం లేక ఇబ్బందిపడుతున్నాడు. వ్యవస్థలను, వ్యక్తులను దారికి తెచ్చుకోవడంలో ఘనుడుగా పేరున్న బాబుకి మోడీని ప్రసన్నం చేసుకోవడం అంత కష్టమేమి కాదన్న మాట వినిపిస్తుంది.