https://oktelugu.com/

‘రేసు గుర్రం’కు సీక్వెల్‌.. హీరో బన్నీ కాదు..‌!

చాన్నాళ్లు ఫెయిల్యూర్ లో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ పోతినేని రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అప్పటిదాకా బ్యాడ్‌ ప్యాచ్‌లో ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు కూడా ఈ మూవీ ఎంతో కిక్‌ ఇచ్చింది. మరో టాప్‌ దర్శకుడు సురేందర్ రెడ్డి… చిరంజీవితో కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ తో హిస్టారికల్‌ మూవీ తీశాడు. తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజైన ఈ మూవీ మంచి పేరు తెచ్చుకుంది. సూరీకి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 10, 2020 / 02:20 PM IST
    Follow us on


    చాన్నాళ్లు ఫెయిల్యూర్ లో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ పోతినేని రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అప్పటిదాకా బ్యాడ్‌ ప్యాచ్‌లో ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు కూడా ఈ మూవీ ఎంతో కిక్‌ ఇచ్చింది. మరో టాప్‌ దర్శకుడు సురేందర్ రెడ్డి… చిరంజీవితో కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ తో హిస్టారికల్‌ మూవీ తీశాడు. తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజైన ఈ మూవీ మంచి పేరు తెచ్చుకుంది. సూరీకి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో ‘రెడ్‌’ మూవీ తీస్తున్నాడు రామ్. షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఇప్పుడు సురేందర్ రెడ్డితో ఓ మూవీకి అతను గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై తాజాగా ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. మాస్‌ ఎంటర్టైనర్స్‌కు కేరాఫ్‌గా నిలిచే రామ్‌, సూరీ కాంబినేషన్లో వచ్చే ఈ మూవీ ‘రేసు గుర్రం’కు సీక్వెల్‌ అన్న ప్రచారం జరుగుతోంది. బన్నీ హీరోగా సురేందర్ రెడ్డి తీసిన రేసుగుర్రం ఎంత భారీ సక్సెస్‌ అయిందో అందరికీ తెలిసిందే.

    ‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?

    సాధారణంగా సీక్వెల్‌ అంటే సేమ్‌ హీరో అన్నది ఆనవాయితీ. ఆర్య, బాహుబలి, కిక్‌ సినిమాలను దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. బన్నీతోనే రేసు గుర్రం సీక్వెల్‌ తీయాలని అనుకున్నప్పటికీ.. అతను ప్రస్తుతం ‘పుష్ప’తో బిజీగా ఉండడం… కరోనా కారణంగా అది ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టత లేకపోవడంతో సూరీ మనసు మార్చుకున్నాడట. సంప్రదాయాన్ని మారుస్తూ రామ్‌తో రేసుగుర్రం తీయాలని ప్లాన్‌ చేశాడట.పైగా బన్నీ మాదిరిగా రామ్‌ కూడా ఎనర్జిటిక్‌ హీరో, మాస్‌ అప్సీల్‌ ఉన్నవాడే కావడంతో అతనికి స్టోరీ చెప్పినట్టు తెలుస్తోంది. కథ నచ్చడంతో రామ్‌ కూడా ఒప్పుకున్నాడట. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. దీనిపై తొందర్లోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్సుందని ఇండస్ట్రీలో టాక్.