Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan- Central Govt: అదును చూసి జగన్ కు దెబ్బేసిన కేంద్రం

CM Jagan- Central Govt: అదును చూసి జగన్ కు దెబ్బేసిన కేంద్రం

CM Jagan- Central Govt
CM Jagan- modi

CM Jagan- Central Govt: తాడేపల్లి ప్యాలెస్ కు ఢిల్లీ దూరమైందా? రెండింటి మధ్య అంతరం పెరిగిందా? సహాయ నిరాకరణ ప్రారంభమైందా? అందులో భాగంగానే జగన్ కు ఈ కొత్త కష్టాలా? ఇక ఎవరి దారి వారిదేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. కరెక్ట్ టైమ్ చేసి జగన్ కు కేంద్ర పెద్దలు దెబ్బేశారన్న టాక్ వినిపిస్తోంది. రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది అన్నరేంజ్ లో ఢిల్లీ పెద్దలు జగన్ కు కటీఫ్ చెప్పారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇన్నాళ్లూ రెండు వైపులా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ స్నేహం సాగింది. ఉభయతారకంగా ఉండేది. కానీ ఇప్పుడు అవసరాలనేవి వన్ సైడ్ గా మారాయి. జగన్ కే ఎక్కువయ్యాయి. దీంతో బీజేపీ కటీఫ్ చెప్పడం ప్రారంభించింది. అసలుసిసలైన పాలిటిక్స్ ను చూపించింది.

ఎప్పుడూ అదే పాట..
ఏపీకి ప్రత్యేక హోదా లేదు. పోలవరానికి నిధులు లేవు. ప్రత్యేక రైల్వేజోన్ లేదు. అయినా అడుగుతునే ఉన్నామని చెప్పిన సీఎం జగన్ కేంద్రానికి ఏనాడూ ఎదురుతిరగలేదు. తన పర్యటనలో ఏ హామీ ఇవ్వకపోయినా కేంద్ర పెద్దలకు శాలువా కప్పి.. శ్రీవారి చిత్రపటాలు ఇచ్చి మరీ వస్తున్నారు. అయితే ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని చెప్పుకొచ్చేవారు. సీఎం అయిన దగ్గర నుంచి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఒకే తరహా రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర పెద్దల ముందు ఉంచినట్టు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే ఇలా వెళ్లి వచ్చే క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు కాకున్నా.. తన వ్యక్తిగత ప్రయోజనాలను పొందడంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యేవారు. పరిమితికి మించి రుణాలు పొందడం, కేసుల నుంచి విముక్తి వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఈసారి ఢిల్లీ వెళ్లినా పెద్దగా వర్కవుట్ కాలేదు. కేంద్ర పెద్దలు పట్టించుకోలేదు. దాని ఫలితమే సమీప బంధువు వైఎస్ భాస్కరరెడ్డి అరెస్ట్.

ఢిల్లీ పర్మిషన్ తో…
ఢిల్లీ పెద్దల పర్మిషన్ లేకుండా సీబీఐ గాలి కూడా పీర్చుకోదు అన్న ముద్ర ఉంది. అటువంటిది భాస్కరరెడ్డి అరెస్ట్ కేంద్ర పెద్దలకు తెలియని పనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంత దూకుడుగా సీబీఐ వ్యవహరించదు అన్న అనుమానాలున్నాయి. ఆ జోరు చూస్తూంటే మరో రెండు రోజుల వ్యవధిలో అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఢిల్లీ కరెక్ట్ టైం చూసి ఎందుకు హ్యాండ్ ఇస్తోంది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైసీపీ పొలిటికల్ గా వీక్ కావడం వల్లే ఢిల్లీ పెద్దల్లో మార్పులు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న జగన్ సర్కారును నమ్ముకుంటే తాము కూడా మునిగిపోవడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన తరువాతే ఢిల్లీ పెద్దలు కాస్తా తగ్గినట్టు ప్రచారం సాగుతోంది.

CM Jagan- Central Govt
CM Jagan- modi

పవన్ ఢిల్లీ టూర్ తో మార్పు..
అయితే ఈ విషయంలో పవన్ పైనే అందరూ అనుమానంగా చూస్తున్నారు. పవన్ ఢిల్లీ పర్యటన తరువాతే కేంద్ర పెద్దల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ బలం కంటే.. వైసీపీ సర్కారుపైఉన్న వ్యతిరేకత ప్రధాన పాత్ర పోషించినట్టు ఢిల్లీకి నివేదికలు అందాయి. అదే సమయంలో అక్కడ పోటీకి దిగిన బీజేపీని వైసీపీ టీమ్ గా ఓటర్లు భావించారు. అందుకే వారంతా టర్న్ తీసుకున్నారు. ప్రత్యామ్నాయంగా టీడీపీని ఎంచుకున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో సైతం ఇదే రిపీట్ అయ్యే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తోంది. పవన్ సైతం వైసీపీ సర్కారుపై సంయుక్త పోరాటంలో ఫెయిల్యూర్స్ ను చూపించారు. వైసీపీపై వ్యతిరేకత ఒక వైపు.. ఆ పార్టీకి వెనుక బీజేపీ ఉండి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు ప్రజల్లో బలంగా విస్తరిస్తోంది. అది ముదిరితే బీజేపీకి దెబ్బ ఖాయమని ఇటీవల పార్టీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి సైతం హెచ్చరించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఢిల్లీ వర్గాలు గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వివేకా కేసులో సీబీఐ కి స్వేచ్ఛ ఇచ్చినట్టు సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version