https://oktelugu.com/

Harish Rao: పవన్, షర్మిల తెలంగాణ ద్రోహులా.. తలసాని, కాసాని, ఎర్రవెల్లి ఎవరో మరీ?!

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై సహజంగానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మరోవైపు మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్‌ కొట్టాలని గులాబీ నేతలు కలలు కంటున్నారు. ఈమేరకు దూకుడు కూడా ప్రదర్శిస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 4, 2023 11:57 am
    Harish Rao

    Harish Rao

    Follow us on

    Harish Rao: బీఆర్‌ఎస్‌ బాస్‌ తమ పార్టీ ట్రబుల్‌ షూటర్‌గా, ఆరడుగుల బుల్లెట్టుగా భావించే సిద్దిపేట ఎమ్మెల్యే.. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ చీప్‌ పాలి‘ట్రిక్‌’కు తెర లేపారు. తమ పార్టీలో తెలంగాణ పదాన్ని పీకిపారేసిన నేతలు.. ఇప్పుడు ఎన్నికల వేళ తెలంగాణ సెంటింమెంటును మళ్లీ తెరైకి తెస్తున్నారు. తెలంగాణ ఉద్యమం 14 ఏళ్లు సాగింది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచింది. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణలో అమలవుతున్న, తాము అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదని గులాబీ నేతలు చెబుతారు. ఇక గులాబీ బాస్‌ అయితే జాతీయ రాజకీయాల్లోకి పోతున్నా.. అంటూ బహిరంగ సభలు కూడా పెట్టారు. జై తెలంగాణ నినాదాన్ని వదిలేసి జైభారత్‌ అనినాదం అందుకున్నారు. బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నారు.

    ఎదురుగాలితో సెంటిమెంట్‌..
    తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై సహజంగానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మరోవైపు మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్‌ కొట్టాలని గులాబీ నేతలు కలలు కంటున్నారు. ఈమేరకు దూకుడు కూడా ప్రదర్శిస్తున్నారు. కానీ, ఈసారి వర్కవుట్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సర్వేలన్నీ హంగ్‌ అంటున్నాయి.. కొన్ని సర్వేలు కాంగ్రెస్‌కు, కొన్ని సర్వేలు బీఆర్‌ఎస్‌కు ఎడ్జ్‌ ఇస్తున్నాయి. దీంతో గెలుపుపై గులాబీ నేతలకు ధీమా సడలుతోంది. ఇదే సమయంలో మేడిగడ్డ కుంగడం, అన్నారానికి బుంగలు పడడం, అసలు బ్యారేజీ నిర్మాణంలో ప్రమాణాలు పాటించడం లేదని డ్యామ్‌ సేఫ్టీ అధారిటీ నివేదిక ఇవ్వడం, అదే సమయంలో దోస్తు అనుకున్న అసదుద్దీన్‌ 9 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం, బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కంటే, కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు డామినేట్‌ చేస్తుండడం గులాబీ నేతలకు మింగుడు పడడం లేదు. వరుస షాక్‌లను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సెంటిమెంటు రాజేసే ప్రయత్నం చేస్తున్నారు.

    వాళ్లు ద్రోహులైతే.. వీళ్లు..?
    ఈ క్రమంలో తెలంగాణ వాదాన్ని హరీశ్‌రావు మళ్లీ తెరైకి తెస్తున్నారు. వద్దని పార్టీ పేరులో తీసేసిన తెలంగాణ పదం మళ్లీ గట్టెక్కిస్తుందని నమ్ముతున్నారు. అందుకే తెలంగాణ ద్రోహులు అని పవన్, షర్మిలను ప్రకటించారు. తెలంగాణ ఇచ్చినందుకు అన్న ముట్టని పవన్‌ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని, తెలంగాణ వద్దన వైఎస్‌.రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందని తెలిపారు. తెలంగాణ ద్రోహులు మద్దతిచ్చే పార్టీలకు ఓటెందుకు వెయాలని ప్రశ్నించారు. అయితే హరీశ్‌రావు తీరు గురివింద గింజ సామెతలా ఉందంటున్నారు విశ్లేషకులు. బీఆర్‌ఎస్‌ నిండా తెలంగాణ ద్రోహులను పెట్టుకుని, విపక్షాల్లో ఉన్న నలుగురు ఐదుగురిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. తలసాని, కాసాని, ఎర్రబెల్లి, అసదుద్దీన్, లాంటి వారు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వాళ్లంతా బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. అది హరీశ్‌కు తెలిసినా.. ఎదుటివారి మీద రాళ్లేడం మొదలు పెట్టారు హరీశ్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే సెంటిమెంట్‌ ముగిసింది. కానీ రెండుసార్లు అదే సెంటిమెంటు అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది బీఆర్‌ఎస్‌. ఇప్పుడు గెలిచే పరిస్థితి కనిపించకపోవడంతో మళ్లీ అదే సెంటిమెంట్‌ రాజేస్తున్నారు.

    అగ్గిపెట్టె దొరకలేదని 1200 మందిని బలి తీసుకుని..
    ఇదే హరీశ్‌రావు తెలంగాణ ఉద్యమ సమయంలో ఓవర్‌ యాక్షన్‌తో 1200 మంది తెలంగాణ యువకులను బలి తీసుకున్నారు. 1200 మంది తల్లులకు కడుపుకోత మిగిల్చారు. 1200 కుటుంబాలకు తీరని శోఖం మిగిచ్చారు. మలిదశ ఉద్యమ సమయం శాంతియుతంగా సాగుతున్న సమయంలో కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టారు. దీక్షను అడ్డుకునేందుకు పోలీసుల యత్నించారు. అయితే దీక్ష ఆగితే తెలంగాణ రాదన్న భావనతో హరీశ్‌రావు సిద్దిపేట వద్ద ఒండిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మాహుతి చేసుకుంటున్నట్లు యాక్షన్‌ చేశారు. ఎమ్మెల్యే హరీశ్‌రావే ఇంతకు తెగించాడని, తాము కూడా అదే బాటలో నడుస్తామని బీసీలు, దళితులు ఆత్మాహుతి చేసుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాంతచారి తొలి అమరుడిగా నిలిచాడు. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్ర. తెలంగాణ సమాజం ఈ విషయం ఎన్నటికీ మర్చిపోదు. ఇప్పటికీ 1200 కుటుంబాల్లో సగం కుటుంబాలకు స్వరాష్ట్రంలో ఎలాంటి సాయం అందలేదు. అవిషం గురించి మాత్రం బీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడరు. ఎదుటివారిపై రాళ్లు వేడయంలో మాత్రం ముందు ఉంటారు.

    ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ సమాజం హరీశ్‌ చీప్‌ ట్రిక్స్‌ నమ్మే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు. అదే నమ్మితే తెలంగాణలో మొదట ఓడించేది హరీశ్‌రావునే అంటున్నారు. 1200 మంది చావుకు కారణమై, 600 కుటుంబాలకు ఎలాంటి సాయం అందించని హరీశ్‌కు తెలంగాణ ద్రోహుల గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నారు.