https://oktelugu.com/

NTR: జూ.ఎన్టీఆర్ పై అభిమానంతో ఆయన అభిమానులు చేసిన పని వైరల్…

ఇలాంటి క్రమంలోనే ఒక వ్యక్తి ఎన్టీఆర్ అభిమానిని అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటూ చెబుతూనే తను కొత్తగా నిర్మించుకునే ఇంటికి పెట్టే ప్రతి ఇటుక మీద కూడా ఎన్టీఆర్ అనే పేరు వచ్చే విధంగా ఇటుకలు డిజైన్ చేయించి తను ఇల్లు కట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : November 4, 2023 / 11:50 AM IST
    NTR

    NTR

    Follow us on

    NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు. ఎందుకంటే తెలుగు లో ఉన్న ప్రతి స్టార్ హీరో కూడా అభిమాన సంఘాలను కూడా కలిగి ఉన్నారనే చెప్పాలి.ఇక ఇలాంటి సిచువేషన్ లో అభిమానులు వాళ్ల అభిమాన హీరో కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోల పుట్టినరోజు నాడు వాళ్ల అభిమానులు రక్త దానాలు చేస్తూ వాళ్ళ హీరో మీద వాళ్ల కి ఉన్న ప్రేమ ని చాటుకుంటుంటే మరి కొంతమంది మాత్రం వాళ్ళ ఒంటిమీద హీరో ఫోటో గాని, హీరో పేరు గాని లేదా హీరో సినిమాల పేర్లు గాని టాటూ వేయించుకుంటూ ఆ హీరోలు అంటే వాళ్లకు ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేస్తున్నారు.

    ఇక ఇలాంటి క్రమంలోనే ఒక వ్యక్తి ఎన్టీఆర్ అభిమానిని అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటూ చెబుతూనే తను కొత్తగా నిర్మించుకునే ఇంటికి పెట్టే ప్రతి ఇటుక మీద కూడా ఎన్టీఆర్ అనే పేరు వచ్చే విధంగా ఇటుకలు డిజైన్ చేయించి తను ఇల్లు కట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా మొత్తంలో వైరల్ అవుతుంది అనే చెప్పాలి.ఇక ప్రస్తుత రోజుల్లో ఇలా ప్రతి అభిమాని కూడా వాళ్ళ అభిమాన హీరో పట్ల వాళ్ల ఇష్టాన్ని ప్రేమని చాటుకోవడం అనేది మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాం కొంతమంది ఫ్యాన్స్ సైకిల్ యాత్రలు చేసుకుంటూ హీరోల దగ్గరికి వచ్చి కలిసి వాళ్లతో ఫోటోలు కూడా దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమం లో ఎన్టీఆర్ కోసం తన అభిమాని ఒకాయన ఇలా ఇంటికి ఎన్టీఆర్ పేరు వచ్చేలా నిర్మించుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…

    ఇలాంటి అభిమానుల కోసమే ఎన్టీఆర్ ప్రతి సినిమాలో తనదైన మార్క్ నటన గాని డ్యాన్స్ చేస్తూ వాళ్ల ని అలరిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఆయన దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు.ఇక ప్రస్తుతం ఈ సినిమాలో కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ నటుడు అయిన సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా మీదనే ప్రస్తుతం ఎన్టీఆర్ భారీ అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది…

    ఈ సినిమా సక్సెస్ తో ఎన్టీఆర్ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు.ఇక ఈ సినిమా కనక ప్లాప్ అయితే ఎన్టీఆర్ కెరియర్ కి కోలుకోలేని దెబ్బ పడినట్టే…ఎదందుకంటే త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు చేసినప్పటికీ ఎన్టీఆర్ కంటే కూడా రామ్ చరణ్ కి ఎక్కువ పేరు వచ్చింది.త్రిబుల్ ఆర్ సినిమా అంటే ఎవరైనా రాంచరణ్ గురించి మాట్లాడుకున్నారు తప్ప ఎన్టీయార్ కి పెద్ద గా పేరు రాలేదనే చెప్పాలి..కాబట్టి ఈ సినిమా విజయం సాధించడం ఎన్టీఆర్ కి చాలా కీలకం కానుంది. ఎందుకంటే పాన్ ఇండియా లెవల్ లో సోలో గా ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా ఇదే కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయితేనే తప్ప ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ హీరోగా ఎదగలేడు అనేది వాస్తవం…