Hardik Pandya: టీమిండియాకు భారీ షాక్.. వరల్డ్ కప్ నుంచి హార్ధిక్ ఔట్.. ఇప్పుడేంటి పరిస్థితి..?

ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే ప్రస్తుతం వరల్డ్ కప్ నుంచి హార్దిక్ పాండ్యా అవుట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గాయం అనేది రోజుకో రకంగా ఉంటూ తనని చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : November 4, 2023 12:21 pm

Hardik Pandya

Follow us on

Hardik Pandya: 2023 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీమ్ ఇప్పటికే వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ మంచి ఊపులో ఉంది. అలాగే సెమీఫైనల్ కి క్వాలిఫై అయిన మొదటిగా టీమ్ గా కూడా సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి క్రమంలో వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ ప్రత్యర్థి టీమ్ లు అన్నింటికి కూడా వెన్నులో వణుకు పుట్టించేలా మ్యాచ్ లు ఆడుతూ అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. ఇక ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ టీం ని చూసి ప్రపంచ దేశాలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే ఈ టోర్నీ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియన్ టీమ్ కి చెందిన ఆల్ రౌండర్ అయిన హర్డిక్ పాండ్యా గాయం కారణంగా ఆ మ్యాచ్ మధ్యలో నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఇక అప్పటినుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ రెస్ట్ కూడా తీసుకుంటున్నాడు. ఇక మొదటగా రెండు మ్యాచ్ లకి హార్థిక్ పాండ్య దూరమవుతాడని మేనేజ్మెంట్ ప్రకటించినప్పటికీ గాయం రోజు రోజుకి తిరగబెట్టడంతో ఆయన ఎంట్రీ అనేది లేట్ అవుతూ వస్తుంది.

ఇక ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే ప్రస్తుతం వరల్డ్ కప్ నుంచి హార్దిక్ పాండ్యా అవుట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన గాయం అనేది రోజుకో రకంగా ఉంటూ తనని చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది.గత కొన్ని రోజులుగా హార్థిక్ పాండ్యా కోలుకున్నాడు నెట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆయన గాయం నుంచి మాత్రం పూర్తిగా కోలుకొని ఫిట్ గా అయితే లేడు కాబట్టి ఆయన ప్లేస్ లో టీం లోకి భారత యువ పేసర్ అయిన ప్రసిద్ది కృష్ణని టీం లోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఇండియా టీమ్ సెమి ఫైనల్ కి క్వాలిఫై అయింది.

కాబట్టి ఇండియన్ టీమ్ లీగ్ దశలో ఇంకో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అది కూడా సౌతాఫ్రికా,నెదర్లాండ్స్ టీమ్ తో రెండు మ్యాచ్ లు ఆడుతుంది.ఇక ప్రస్తుతానికైతే ఇండియా నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. సౌతాఫ్రికా తో ఆడే మ్యాచ్ లో ఆ టీమ్ ని ఓడించినట్లయితే ఇక ఇండియన్ నెంబర్ వన్ పొజిషన్ లోనే కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇలాంటి క్రమంలో హార్థిక్ పాండ్యా టీం నుంచి వెళ్లిపోవడం ఇండియన్ టీం కి చాలా వరకు మైనస్ గా మారినప్పటికీ ఆయన గాయం తీవ్రత వల్లే అతనికి రెస్ట్ ఇచ్చినట్టు గా కూడా తెలియజేస్తున్నారు… ఇక ఇప్పటివరకు ఆయన ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ ని తీసుకొని నెంబర్ సిక్స్ లో బ్యాటింగ్ చేయిస్తున్నారు.

ఇక మీదట కూడా సూర్యనే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అయితే సూర్య కొన్ని మ్యాచ్ ల్లో సక్సెస్ అయినప్పటికీ మరికొన్ని మ్యాచ్ ల్లో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో హార్థిక్ పాండ్యా లేని లోటు టీమిండియాలో చాలా స్పష్టం గా కనిపిస్తుంది అంటూ చాలా మంది సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇండియన్ టీం ఈసారి కప్పు గెలవాలనే భరోసాతో ముందుకు వెళుతుంది ఇక కప్పు గెలుస్తుందా లేదా అనేది చూడాలి…