Harish Rao: తెలంగాణలో అభివృద్ధి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సిద్దిపేట. ఆ తర్వాత గజ్వేల్, సిరిసిల్ల. ఈమూడు నియోజకవర్గాలు మొదటిది ప్రస్తుత ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుది. రెండోది ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. ఇక మూడోది ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ది. నియోజకవర్గాల అభివృద్ధి అంటే రాష్ట్రంలో ఈ మూడింటినే ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇక ముందుగా చెప్పుకోవాల్సింది. సిద్దిపేట గురించే.
నియోజకవర్గానికి తొలి ప్రాధాన్యం..
హరీశ్‌రావు నియోజకవర్గం అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆయన రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత ప్రాధాన్యత తన సొంత నియోజకవర్గానికి ఇస్తారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా ఉన్న సమయంలోనూ తన లాబీయింగ్‌లో నిధులు తెచ్చుకుని సిద్ధిపేటను అద్భుతంగా తీర్చిదిద్దారు. సిద్దిపేట పట్టణం రాష్ట్రంలో సీఎం నియోజకవర్గంకన్నా అద్భుతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
సీఎం నియోజకవర్గం..
ఇక తర్వాత చెప్పుకోవాల్సింది సీఎం కేసీఆర్ నియోజకవర్గమే. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం అభివృద్ధి చేసుకోకపోతే విమర్శలు తప్పవు. అందుకని తనను గెలిపించిన ప్రజలకు కేసీఆర్ ఏదీ కాదనకుండా అభివృద్ది చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా తన స్వగ్రామంలో ఇళ్లన్నీ డబుల్ బెడ్రూం ఇళ్లుగా మార్చారు. రహదారులు విస్తరించారు. ప్రతీ గ్రామంలో మట్టి రోడ్లు కనిపించవు.
కేటీఆర్ అనుసరిస్తున్నారు..
ఇక ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గ అభివృద్ధికి నిష్పక్షపాతంగా పనిచేస్తే ఎలా ఉంటుంది అనడానికి ఉదాహరణ కేటీఆర్, ఆయన నియోజకవర్గం సిరిసిల్ల నిలుస్తాయి. తన బావ హరీశ్‌రావు, తండ్రి కేసీఆర్‌ను కేటీఆర్ అనుసరిస్తున్నారు. సిరిసిల్ల అభివృద్ధి అంటే కేటీఆర్‌కు ముందు.. కేటీఆర్ వచ్చిన తర్వాత అన్నట్లుగా సిరిసిల్లను తీర్చిదిద్దారు. ప్రజలు ఏదీ అడగకుండానే వారి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని అభివృద్ధి చేయడం కేటీఆర్ ఒంట పట్టించుకున్నారు. దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యేగా కేటీఆర్‌ను తప్ప మరెవరినీ ఊహించుకోనంతగా అక్కడి జనం కనెక్ట్ అయిపోయారు.
చెప్పింది చేస్తారు..
ఇక కేటీఆర్ విషయానికి వస్తే.. ఆయన ఏది చెబితే అది చేస్తూ వస్తున్నారు. ఇందుకు ఒక లక్కు ఏంటంటే తల తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం కూడా. దీంతో తాను ఏది తలుచుకుంటే అది చేసేస్తున్నాడు. తాజాగా మిడ్ మానేరులో బోటింగ్ ప్రారంభించిన కేటీఆర్.. సరదగా మీడియా మిత్రులతో కలిసి బోటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఓ మీడియా మిత్రుడితో మాట్లాడారు. మిడ్‌మానేరు మధ్యలో ఉన్న ఓగుట్టను చూపిస్తూ.. దీనిని ఫొటో తీసుకోవాలని సూచించారు. వచ్చే ఐదేళ్లలో దీనిని ఎలా మారుస్తానో చూడు అని చాలెంజ్ చేశారు. సిరిసిల్లకు వచ్చారంటే.. ఐదు రోజులు ఉండేలా హైదరాబాద్ వసులు ప్లాన్ చేసుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఒకరోజు మిడ్‌మానేరు. మరోరోజు సిరిసిల్ల పవర్‌లూమ్స్, ఇంకో రెండురోజులు వేములవాడ రాజన్న ఆలయం క్షేత్రంలో గడిపేలా ఉండాలన్నారు. మిడ్‌మానేరులో రోప్ ఎక్కితే.. వేములవాడలో దిగేలా 2028 వరకు తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు.
కమిట్మెంట్.. ఉన్న నేత ఎమ్మెల్యే అయితే ఎలాం ఉటుంది అనేందుకు కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఎంత కమిట్‌మెంట్ ఉన్నా నిధులు ఇవ్వాలిగా అన్న విమర్శలు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వస్తున్నాయి. తండ్రి, కొడుకు, అల్లుడి నియోజకవర్గాలకే అధికంగా నిధులు కేటాయించుకుంటున్నారన్న విమర్శలు స్వపక్షంలోనే ఉన్నాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Harish raos constituency has become an example in the development of the united state
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com