పీఏకు కరోనా.. క్వారంటైన్ కి వెళ్లిన మంత్రి

రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. లాక్డౌన్ సడలింపులకు ముందు హైదరాబాద్ మహానగరం మినహా మిగతా అన్ని జిల్లాల్లో కరోనా కట్టడిలోనే ఉండేది. అయితే ఇటీవల లాక్డౌన్లో భారీ సడలింపులు ఇవ్వడంతో ఆయా జిల్లాల్లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలోనూ కేసులు సంఖ్య భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్ వారియర్స్ అయిన వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు జర్నలిస్టులు కరోనా […]

Written By: Neelambaram, Updated On : June 13, 2020 1:56 pm
Follow us on


రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. లాక్డౌన్ సడలింపులకు ముందు హైదరాబాద్ మహానగరం మినహా మిగతా అన్ని జిల్లాల్లో కరోనా కట్టడిలోనే ఉండేది. అయితే ఇటీవల లాక్డౌన్లో భారీ సడలింపులు ఇవ్వడంతో ఆయా జిల్లాల్లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలోనూ కేసులు సంఖ్య భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

కోవిడ్ వారియర్స్ అయిన వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు జర్నలిస్టులు కరోనా మహమ్మరి బారినపడి మృత్యువాత పడుతున్న సంగతి తెల్సిందే. తాజాగా ప్రజాప్రతినిధులు సైతం ఆ లిస్టులో చేరుతున్నారు. చాలారోజులుగా కరోనా కేసులు నమోదుకానీ సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు పీఏ సహా 11మంది కరోనా బారిన పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఓ వ్యక్తికి కరోనా పాజిటిల్ అని తేలింది. దీంతో కలెక్టర్ సహా అధికారులంతా హోం క్వారంటైన్లోకి వెళ్లారు. కలెక్టర్ ఇంటి నుంచే విధులను నిర్వర్తిస్తున్నారు.

తాజాగా హరీష్ రావు పీఏకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో హరీష్ రావు హోంక్వారంటైన్లోకి వెళ్లారు. మంత్రి పీఏతో కాంటాక్ట్ అయిన 51మంది శాంపిళ్లను సేకరించగా 17మందికి నెగటివ్ తేలింది. మిగతా వారి రిపోర్టులు నేడు వచ్చే అవకాశం ఉంది. కాగా హరీష్ రావు పీఏను కలిసి ఇప్పటికే ఐదురోజులు అయిందని దీంతో వారం రోజులపాటు క్వారంటైన్లో ఉంటానని హరీష్ రావు తెలిపారు. తన పనులన్నీంటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులు చక్కబెడతానని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ఇదిలా ఉంటే ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. చికిత్స అనంతరం వారంతా కోలుకున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సైతం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఆస్పత్రిలోచేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ కరోనా టెస్టు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. అయితే మేయర్ ఎక్కడికి వెళితే అక్కడ కరోనా ఉండటం చూస్తుంటే రాష్ట్రంలో కరోనా ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.