Photo Morphing Scams: ఈ సమాజం ఎటు పోతుందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా మహిళల పట్ల, ఆడపిల్లల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లోనూ, బయట సమాజంలోనే కాకుండా చివరికి సోషల్ మీడియాలో కూడా వారికి వేధింపులు తప్పట్లేదు. పెరుగుతున్న టెక్నాలజీ కూడా వారికి శాపంగా మారుతుంది. చాలాసార్లు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో వారితో ఫ్రెండ్షిప్ చేసి చివరికి వారిని మోసం చేస్తున్న ఘటనలు అనేకం చూస్తున్నాం.

అయితే ఇప్పుడు జరిగిన ఘటన ఆడవాళ్లు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితిని కల్పిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లాలోని ముప్పాళ్ళ మండలంలో వెలుగు చూసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. చివరికి మహిళలను ఇలా కూడా వేధిస్తారా అంటూ అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగకు సరదాగా ఊర్లో గడుపుదామని ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన మహిళల మర్యాదను కొందరు కీచకులు నెట్టింట్లో అమ్మకానికి పెట్టేశారు. అయితే ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూడటంతో వందలాది మంది బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వివేకా హత్య కేసులో ఇక వేగం పెరగనుందా?

ఈ ఏడాది సంక్రాంతి పండుగకు స్వగ్రామంలో సంతోషంగా గడపడానికి ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి చాలామంది మహిళలు, యువతులు వచ్చారు. అయితే ఇలా వచ్చిన వారిలో పండగకు అందంగా రెడీ అయిన కొంతమంది మహిళలు, యువతుల ఫొటోలను గ్రామానికి చెందిన కొందరు బీటెక్ స్టూడెంట్లు వారికి తెలియకుండా తీశారు. ఇలా తీసిన ఫోటోలను వారికి తెలిసిన పోర్న్ వెబ్ సైట్లకు అమ్మేసారు. ఇంకొందరు యువతుల ఫొటోలతో సోషల్ మీడియాలో ఫేక్ ఐడీ లు క్రియేట్ చేసి అబ్బాయిలతో చాటింగ్ చేసేవారు.
ఫేక్ ఐడీలతో అమ్మాయిలమే అంటూ నమ్మించి అబ్బాయిల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. అయితే ఇలా పండక్కు వచ్చి వెళ్లిన ఓ మహిళ ఫొటోను పోర్న్ వెబ్ సైట్లో చూసిన ఆమె కొడుకు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో చాలా పెద్ద విషయాలు బయటపడ్డాయి. ఆకతాయిలు ఇలా చాలామంది ఫొటోలను పోర్న్ వెబ్ సైట్లను అమ్మేశారని ఇంకొందరు ఫోటోలను మార్ఫింగ్ చేసి పోర్న్ వీడియోలు కూడా చేశారంటూ తెలిసింది. ఈ విషయం తెలియడంతో ఊరికి వచ్చి వెళ్లిన వందలాది మంది మహిళలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో పెను సంచలనంగా మారింది.
Also Read: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్.. కేసీఆర్‌కు పెద్ద ఆయుధం దొరికిందిగా..!