Traffic Challan Telangana: బైకు, లేదా కార్ మీద ఉన్న చలాన్ లను కట్టలేక ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇప్పుడు పోలీస్ శాఖ తీసుకు వచ్చిన బంపర్ ఆఫర్ ను వినియోగించుకోండి. ఈ రోజు నుంచి మార్చి 30 వరకు మీకు అవకాశం ఉంది. వాహనాల మీద ఉన్న పెండింగ్ చలాన్ లను ను ఎలాగైనా వసూలు చేసేందుకు రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చలాన్ లను మొత్తం కట్టమంటే వాహనదారులు కట్టట్లేదు కాబట్టి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
టూ వీలర్ మీద అయితే 75%, కార్లు, ఇతర భారీ వాహనాల మీద 50 శాతం, ఆర్టీసీ బస్సులకు అయితే 70 శాతం, అలాగే తోపుడు బండ్లకు అయితే ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లను ప్రకటించారు అధికారులు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో వందల కోట్ల చలాన్లు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇక వీటిలో చాలా వరకు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 600 కోట్ల వరకూ పెండింగ్ చలాన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఇలాగే ఉంచితే ఇవి వసూలు అయ్యేట్లు లేవని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: ఒంటరివాడైన పుతిన్..: పరాభావం తప్పదా..?
నెల రోజుల పాటు ఈ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచుతామని వాహనదారులు ఈ-చలాన్ వెబ్ సైటు లేదంటే ఈ- సేవ, మీ-సేవలో చలాన్లు కట్టాలంటూ చెబుతున్నారు. ఇక లాక్ డౌన్ లో మాస్కు పెట్టుకొని వారికి వెయ్యి రూపాయలు ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. ఇలా ఫైన్ పడిన వారందరూ కూడా ఇప్పుడు కేవలం వంద రూపాయలు చెల్లిస్తే చాలు అంటున్నారు ఆఫీసర్లు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కూడా ఇలాంటి డిస్కౌంట్లను ప్రకటించారు.
ఇక హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు. ఆ జోన్లలో స్పీడ్ గన్ లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పెండింగ్ చలాన్లు ఒకేసారి కట్టలేని వారందరికీ ఇది మంచి అవకాశం అని కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోవాలి అంటూ ట్రాఫిక్ పోలీసులు వివరిస్తున్నారు. మార్చి 30 వరకు అవకాశం ఉంది కాబట్టి అందరూ చలాన్ లను క్లియర్ చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. అయితే చాలా చోట్ల వాహనదారులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎగబడుతున్నారు. నిమిషానికి దాదాపు 700 నుంచి 1000 వరకు చలాన్లు క్లియర్ అవుతున్నట్టు అధికారులు వివరిస్తున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఈ ఆఫర్ ను వినియోగించుకోండి.
Also Read: ఆఖరుకు సీఎం జగన్ ఆదాయం కోసం వలంటీర్లను మరుగుదొడ్ల వద్ద కాపాలా పెట్టించాడా? వైరల్ పిక్?