Bheemla Nayak Box Office Collections: పవన్ కళ్యాణ్ మేనియా ఆంధ్రాలోనే కాదు.. తెలంగాణలోనూ ఏమాత్రం తగ్గలేదని ‘భీమ్లానాయక్’ కలెక్షన్లు చూస్తే అర్థమవుతోంది. ఏపీ రాజకీయ నాయకుడైన పవన్ కు అక్కడి జనాలు కాదు.. తెలంగాణ వాసులు గొప్పగా ఆదరించేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తెలంగాణలోనూ హిట్ టాక్ ను దక్కించుకొని భారీ వసూళ్లను రాబడుతోంది. వంద కోట్లకు పైగా ఇప్పటికే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా వారాంతంలో కూడా మంచి వసూళ్లను దక్కించుకుంది.

ఆదివారం వరకు సినిమా జోరు కొనసాగి ఆతర్వాత సైలెంట్ అయ్యే అవకాశం ఉందని కొందరు భావించారు. కాని సోమవారం మహాశివరాత్రి సెలవు రావడంతో సినిమాకు భారీ గా వసూళ్లు నమోదు అయ్యాయి. భీమ్లా నాయక్ కు మహా శివరాత్రి సెలవు గొప్పగా కలిసి వచ్చింది.
Also Read: భీమ్లానాయక్ ను కొట్టే సినిమా ఏది?
సినిమా కు భారీగా వసూళ్లు నమోదు అవ్వబోతున్నట్లుగా ముందు నుండే టాక్ వినిపించింది. ఊహించినట్లుగానే శివరాత్రి సందర్బంగా నైజాం ఏరియాలో 85 నుండి 100 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదు అయినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శివ రాత్రి సందర్బంగా సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున వెళ్తున్నారు. దాంతో మల్టీ ప్లెక్స్ ల్లో అదనపు షో లు మరియు స్క్రీన్స్ కూడా వేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 27.5 కోట్ల వసూళ్లు నమోదు అయినట్లుగా ట్రేడ్ వర్గాల టాక్. భీమ్లా నాయక్ జోరు చూస్తుంటే కేవలం నైజాం ఏరియాలోనే హాఫ్ సెంచరీ కొట్టే అవకాశం ఉందనిపిస్తుంది.
Also Read: రామారావ్ ఆన్ డ్యూటీ: నేరస్తుల తాట తీస్తున్న రవితేజ
[…] Prabhas vs Ram charan: వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పేలా లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతి టైంలోనే రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ భారీ సినిమాలు ఒకేసారి వస్తాయా? డేట్లు మారుస్తారా? అనేది చూడాలి. […]
[…] F3 Movie Release Date: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఎఫ్3- సమ్మర్ సోగ్గాళ్లు పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మే 27న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. […]
[…] Also Read: Bheemla Nayak Box Office Collections: భీమ్లానాయక్ కి నైజాంలో… […]