ఐదు రాష్ట్రాల పార్టీల్లో ఒక్కటే హ్యాపీనా..?

రెండు రోజుల కిందటి వరకు ఐదు రాష్ట్రాల్లో (ఒక కేంద్రపాలిత ప్రాంతం) జరిగిన ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్నా ఈ ఎన్నికలు ఆటంకం లేకుండా నిర్వహించడం చూస్తే ఇక్కడి ఫలితాలపై ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికలు ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ వెంటనే కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాయి. ఆయా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని కొన్ని సర్వే సంస్థలు అంటున్నాయి. […]

Written By: NARESH, Updated On : April 30, 2021 11:30 am
Follow us on

రెండు రోజుల కిందటి వరకు ఐదు రాష్ట్రాల్లో (ఒక కేంద్రపాలిత ప్రాంతం) జరిగిన ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్నా ఈ ఎన్నికలు ఆటంకం లేకుండా నిర్వహించడం చూస్తే ఇక్కడి ఫలితాలపై ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుంది. ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికలు ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ వెంటనే కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాయి. ఆయా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని కొన్ని సర్వే సంస్థలు అంటున్నాయి. అయితే ఒక్క రాష్ట్రంలో మాత్రం కంప్లీట్ గా ప్రతిపక్షం అధికారంలోకి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉందని ఎగ్జిట్స్ చెబుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే ఇక్కడ అధికారం కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే కేంద్రం పెద్దలు ఇక్కడ పాగా వేసి అధికారం కోసం వ్యూహాలు పన్నారు. అయితే టీఎంసీకి మాత్రం ఈ ఎన్నికలు పరాభావం అవుతాయా..? అంటే చెప్పలేమంటున్నారు. ఎందుకంటే సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ రాష్ట్రంలో అధికారం కోసం కష్టపడ్డారు. మరి ఆయనను ఎంత ఆదరిస్తారన్నది ఆసక్తి అంశమే.

ఇక మరో రాష్ట్రం తమిళనాడులో ఎప్పుడూ రెండు పార్టీలకే అధికారం ఉంటున్నది సర్వ సత్యం. సాంప్రదాయంగా ఈసారి అధికార మార్పడి జరుగుతుందంతే అని ఎగ్జిట్స్ చెబుతున్నాయి. అన్నా డీఎంకే పార్టీ అధినేత జయలలిత మరణంపై ఛిన్నాభిన్నమైన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. కేంద్రం నుంచి పలు ప్రాజెక్టులను కూడా ప్రారంభించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే క్లియర్ కట్ గా ఇక్కడ డీఎంకే కే ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు.

సౌత్ రాష్ట్రాల్లో ఒకటైన పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం)పై కాషాయ జెండా ఎగిరే అవకాశం ఉందని అంటున్నాయి. అయితే అది బీజేపీకి పెద్దగా లాభం చేకూర్చే విషయం కాదంటున్నారు. కేరళ విషయానికొస్తే మరోసారి పినరయి పీఠం మీద కూర్చొడానికి కొంచెం కష్టపడాల్సి వస్తోంది కావొచ్చంటున్నారు. అనుకున్న మెజారిటీపైనే అనుమానాలున్నాయని చర్చించుకుంటున్నారు. అసోంలో అధికారాన్ని నిలుపుకున్నా అనుకున్న మెజారిటీ రాకపోవచ్చనే వాదనలున్నాయి. ఏదీ ఏమైనా వచ్చే నెల 2న మధ్యాహ్నం వరకు వేచి ఉండాల్సిందే.