
దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న పలువురు ఖైదీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. దాంతో అన్ని జైళ్లు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి కరోనా బాధిత ఖైదీలకు చికిత్స అందిస్తున్నాయి. తీహార్ జైల్లో అయితే పరిస్థితి కొంత తీవ్రంగా ఉంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగడమే గాక, ఈ సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు నలుగురు ఖైదీలు కరోనాతో చనిపోయారు. దీంతో తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశారు.