బాలయ్య ‘అఖండ’ సినిమాలో బాలయ్య బాబుతో రొమాన్స్ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తెగ కష్టపడుతుంది ‘ప్రగ్యా జైస్వాల్’. లేకపోతే రెండు వారాలు క్రితమే సినిమా ఇండస్ట్రీ మొత్తం తమ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చేస్తే.. బాలయ్య మాత్రం తన అఖండకి బ్రేక్ ఇవ్వకుండా షూట్ ను నిన్నటివరకూ కంటిన్యూ చేశాడు. ఈ షూట్ లో బాలయ్యతో పాటు ‘ప్రగ్యా జైస్వాల్’ కూడా పాల్గొని తెగ హార్డ్ వర్క్ చేసింది.
అయితే అఖండ తాజా షెడ్యూల్ కి నిన్నటితో ప్రగ్యా జైస్వాల్ ప్యాకప్ చెప్పినట్టు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. నిన్నటి వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్ లో బాలయ్య – ప్రగ్యా పై కొన్ని లవ్ సీన్స్ తీసారట. ఈ లవ్ సీన్స్ సినిమాకే కీలకమైన సన్నివేశాలు అని ఈ టాల్ బ్యూటీ చెప్పుకొచ్చింది.
ఇక బాలయ్య అభిమానూలు చాల సంవత్సరాలు తరువాత అఖండ టీజర్ సాధించిన 50 మిలియన్ల వ్యూస్ ను చూసి, తల ఎత్తుకుని సగర్వంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోకి సరైన డైరెక్టర్ పడితే.. వంద కోట్లు పెద్ద లెక్క ఏమి కాదు అంటూ బాలయ్య ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. పైగా ఈ క్రెడిట్ అంతా బోయపాటి శ్రీనుకే దక్కుతుంది అంటూ.. బోయపాటిని ఓ రేంజ్ లో పొగుడుతున్నారు.
మొత్తమ్మీద చాల సంవత్సరాలుగా వృద్ధ సింహం లాగా గర్జించలేక పోతున్న బాలయ్య చేత కూడా బాక్సాఫీస్ దద్దరిల్లిపోయేలా గర్జించేలా చేసిన బోయపాటికి నందమూరి అభిమానులు ఎప్పటికీ రుణపడి ఉంటారు. అలాగే ప్రగ్యా కూడా రుణ పడి ఉంటుంది. హీరోయిన్ గా ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిన ఈ బ్యూటీ కెరీర్ కి, ఇప్పుడు అఖండ పెద్ద ప్లస్ లా మారనుంది. అందుకే ప్రగ్య జైస్వాల్ ఈ మధ్య తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో గ్లామర్ ఫోటోలు తెగ పెడుతూ తన ఆనందాన్ని ఆ రకంగా వ్యక్తపరుస్తోంది.