https://oktelugu.com/

చైనాలో పుట్టుకొచ్చిన మరో మహ్మమరి

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రపంచం గజగజ వణికిపోతుంది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈమేరకు తగిన నివారణ చర్యలను ఆయా దేశాలు చేపడుతున్నాయి. అయితే తాజాగా మరో వైరస్ పుట్టుకొచ్చి ప్రపంచానికి సవాల్ విసురుతోంది. కరోనా పుట్టిన గడ్డపైనే ఈ కొత్తరకం వైరస్ పుట్టుకొచ్చింది. దీనికి వైద్యులు ‘హంటా’గా నామకరణం చేశారు. ఈ హంటర్ వ్యాధి సోకి చైనాలో ఒకరు మృతిచెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చైనాలో హంటా వైరస్ లక్షణాలు మరో 32మందిలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 24, 2020 3:42 pm
    Follow us on

    కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రపంచం గజగజ వణికిపోతుంది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈమేరకు తగిన నివారణ చర్యలను ఆయా దేశాలు చేపడుతున్నాయి. అయితే తాజాగా మరో వైరస్ పుట్టుకొచ్చి ప్రపంచానికి సవాల్ విసురుతోంది. కరోనా పుట్టిన గడ్డపైనే ఈ కొత్తరకం వైరస్ పుట్టుకొచ్చింది. దీనికి వైద్యులు ‘హంటా’గా నామకరణం చేశారు. ఈ హంటర్ వ్యాధి సోకి చైనాలో ఒకరు మృతిచెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

    చైనాలో హంటా వైరస్ లక్షణాలు మరో 32మందిలో ఉన్నట్లు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించింది. దీంతో చైనావాసులు బెంబెలెత్తిపోతున్నారు. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ లో ఈ హంటా వైరస్ పుట్టుకొచ్చినట్లుగా భావిస్తున్నారు. యూనాన్ ప్రావిన్స్ కు వచ్చిన ఓ వ్యక్తిలో హంటా వైరస్ లక్షణాలను గుర్తించారు. 33మంది ప్రయాణికుల ఉన్న బస్సులో ప్రయాణించిన ఆ వ్యక్తి హంటా వైరస్ తో కొన్ని గంటల్లోనే మృతిచెందాడు. దీంతో చైనా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

    ఆ వ్యక్తితో బస్సులో ప్రయాణించిన వారందరికి పరీక్షలను నిర్వహించింది. కొందరికీ పాజిటివ్ లక్షణాలు కన్పించడంతో వారిని ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ హంటా వైరస్ ఎలుకల ద్వారా వస్తుందని వైద్యులు తెలిపారు. ఎలుకలు వదిలిన లాలాజలం.. మాలమూత్రం ద్వారా వైరస్ విస్తరిస్తుందని, ఎలుకలు కరవడం ద్వారా వచ్చే అవకాశం ఉందని.. ఇది అంటువ్యాధి కాదని నిపుణులు పేర్కొంటున్నారు. దీనిని ప్రాథమిక దశలో నివారించకపోతే ప్రాణాంతకంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.