కరోనా ఎఫెక్ట్.. ఖైదీలకు వరమా?

కరోనా పేరు చెబితేనే ప్రపంచం గజగజలాడిపోతుంది. చైనాలో సోకిన కరోనా మహహ్మరి క్రమంగా అన్నిదేశాలకు పాకింది. కరోనా మహ్మమరికి భయపడి ప్రజలు ఇళ్లకు పరిమితమవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కరోనా ఎఫెక్ట్ మాత్రం ఖైదీలకు వరంగా మారింది. కరోనా నివారించడానికి సరైన సదుపాయాలు లేవని కారణంతో మంగళవారం న్యూజెర్సీలోని 1000మంది ఖైదీలను విడుదల చేయాలని న్యూజెర్సీ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వీరిలో త్రీవమైన నేరాలకు పాల్పడిన వారిని విడుదల చేయడం లేదు. కేవలం […]

Written By: Neelambaram, Updated On : March 24, 2020 2:55 pm
Follow us on

కరోనా పేరు చెబితేనే ప్రపంచం గజగజలాడిపోతుంది. చైనాలో సోకిన కరోనా మహహ్మరి క్రమంగా అన్నిదేశాలకు పాకింది. కరోనా మహ్మమరికి భయపడి ప్రజలు ఇళ్లకు పరిమితమవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కరోనా ఎఫెక్ట్ మాత్రం ఖైదీలకు వరంగా మారింది. కరోనా నివారించడానికి సరైన సదుపాయాలు లేవని కారణంతో మంగళవారం న్యూజెర్సీలోని 1000మంది ఖైదీలను విడుదల చేయాలని న్యూజెర్సీ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

వీరిలో త్రీవమైన నేరాలకు పాల్పడిన వారిని విడుదల చేయడం లేదు. కేవలం జైళ్లలో సత్పప్రవర్తన కలిగిన ఖైదీలను మాత్రమే విడుదల చేయాలని న్యాయమూర్తి నిర్ణయించారు. దీంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కరోనాతో తమకు విముక్తి కలిగినందుకు ఆనందపడాలో.. లేక కరోనా మహమ్మరి ప్రపంచాన్ని కబలిస్తున్నందుకు దుఃఖించాలో తెలియని పరిస్థితిలో ఖైదీలున్నారు. కరోనాతో ప్రజలు భయాందోళన చెందుతుంటే.. కొందరు ఖైదీలు మాత్రం జైలు నుంచి కూడా విడుదలవడం గమనార్హం. న్యూజెర్సీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఖైదీలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.