https://oktelugu.com/

హంటా వైరస్ లక్షణాలు ఇవే..

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రపంచం గజగజ వణికిపోతుండగా మరో కొత్త వైరస్ పుట్టికొచ్చింది. చైనాలోనే ఈ కొత్త వైరస్ పుట్టుకురావడం గమనార్హం. దీనికి వైద్యులు ‘హంటా’గా నామకరణం చేశారు. ఈ హంటా వైరస్ సోకి చైనాలో ఒకరు మృతిచెందడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా హంటర్ వ్యాధి లక్షణాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. -ఎలుకల ద్వారా సోననున్న ‘హంటా’.. హంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకలు వదిలిన లాలాజలం, మలం, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 24, 2020 / 03:52 PM IST
    Follow us on

    కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రపంచం గజగజ వణికిపోతుండగా మరో కొత్త వైరస్ పుట్టికొచ్చింది. చైనాలోనే ఈ కొత్త వైరస్ పుట్టుకురావడం గమనార్హం. దీనికి వైద్యులు ‘హంటా’గా నామకరణం చేశారు. ఈ హంటా వైరస్ సోకి చైనాలో ఒకరు మృతిచెందడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా హంటర్ వ్యాధి లక్షణాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

    -ఎలుకల ద్వారా సోననున్న ‘హంటా’..
    హంటా వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకలు వదిలిన లాలాజలం, మలం, మూత్రం వల్ల మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. ఎలుకలు కరవడం వల్ల కూడా వచ్చేఅవకాశముంది. హంటా వైరస్ అంటు వ్యాధి కాదు. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు. అయితే హంటా వైరస్ సోకిన వ్యక్తి మూత్రం, మలం ఇతరుల శరీరాలకు వెళితే వారికి ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తి మలం, మూత్రం మంచినీటిలో కలిసి ఆ నీరుతాగితే సంక్రమిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు డెంగ్యూ వ్యాధిని పోలి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక దశలోనే ఈ వైరస్ ను గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేనట్లయితే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

    -హంటా వైరస్ లక్షణాలివే..
    హంటా వైరస్ సోకిన వ్యక్తికి తీవ్ర జ్వరం వస్తుంది. ఉన్నట్టుండి కండరాల నొప్పి, ఆ తర్వాత బీపీ తగ్గుతుంది. మూత్రపిండాల పనితీరులో మార్పులు చోటుచేసుకుంటాయి. నీరుడు తక్కువగా అవడం. ఆ తర్వాత నీరు ఎక్కువగా పోవడము. మూత్రపిండాలు పాడవడం. ఊపిరి తీసుకోవడములో ఇబ్బందులు ఏర్పడుతాయి. గుండె వేగంగా కొట్టుకోవడం. దగ్గు ఎక్కువగా వచ్చి గుండెపోటుతో మరణిస్తారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కరోనా అరికట్టేందుకు ప్రపంచం నానా ఇబ్బందులు పడుతుంటే.. మరో మహమర్మి చైనాలో పుట్టుకురావడం ప్రపంచాన్ని బెంబెలేత్తిస్తుంది.