https://oktelugu.com/

విలన్ గా ఇంత గొప్పగా నటించగలడా ? దర్శకులూ చూడండి !

Actor Sunil: సినిమాకు ఒక నియమం ఉంది. విలన్ ఎంత బలవంతుడు అయితే, ఆ హీరో అంత గొప్పవాడవుతాడు. అవసరం అయితే, హీరో కంటే విలన్ నే బాగా చూపించాలి. తెలుగు సినిమా చరిత్రలో తమ నటనతో ఘనమైన ఖ్యాతిని గడించిన విలన్లు ఎందరో ఉన్నారు. వాళ్ళ సరసన ‘పుష్ప’ సినిమాతో తాను కూడా చేరతానని సునీల్ చాలా బలంగా చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు అది నిజమే అయింది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 17, 2021 / 03:33 PM IST
    Follow us on

    Actor Sunil: సినిమాకు ఒక నియమం ఉంది. విలన్ ఎంత బలవంతుడు అయితే, ఆ హీరో అంత గొప్పవాడవుతాడు. అవసరం అయితే, హీరో కంటే విలన్ నే బాగా చూపించాలి. తెలుగు సినిమా చరిత్రలో తమ నటనతో ఘనమైన ఖ్యాతిని గడించిన విలన్లు ఎందరో ఉన్నారు. వాళ్ళ సరసన ‘పుష్ప’ సినిమాతో తాను కూడా చేరతానని సునీల్ చాలా బలంగా చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు అది నిజమే అయింది.

    Sunil


    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో నేడు రిలీజ్ అయిన ‘పుష్ప’ సినిమాలో సునీల్ మంగళం శ్రీనుగా ఓ కీలక పాత్రలో నటించాడు. ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి మంచి హాస్యాన్ని పండించిన సునీల్, మంగళం శ్రీనుగా నేడు విలనిజాన్ని పండించాడు. డిఫరెంట్ గెటప్ లో, చిత్తూరు యాసతో సునీల్ నటించిన తీరు చాలా బాగుంది.

    పైగా సినిమాలో సునీల్ పాత్ర చాలా బాగా వచ్చింది. దాంతో సునీల్ పాత్ర పై అందరికీ ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తికి సునీల్ పూర్తీ న్యాయం చేశాడు. సునీల్ కి భార్యగా నటించిన అనసూయ తన పీక కోసే సీన్ లో.. సునీల్ నటన చాలా సహజంగా ఉంది. మొత్తమ్మీద ఈ రోల్ సునీల్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది.

    ప్రేక్షకులు కూడా సునీల్ పెర్ఫార్మన్స్ చూసి షాక్ అయ్యారు. విలన్ పాత్రలోనూ సునీల్ ఇంత గొప్పగా నటించగలడా ? అని సోషల్ మీడియాలో మెసేజ్ లు పోస్ట్ చేసున్నారు. నిజానికి సినిమా ఎడిటింగ్ సమయంలోనే కావాలని సునీల్ సీన్స్ పెట్టుకుని చూశానని, సునీల్ పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిపోయాను అని బన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

    Also Read: Pushpa Movie: ‘పుష్ప’కు అక్కడ మైనస్.. ఇక్కడ ప్లస్?

    మరి సునీల్ నటన చూసి మిగిలిన దర్శకులు కూడా ఫిదా అయి, సునీల్ కి విభిన్న పాత్రలు ఇస్తారేమో చూడాలి. పైగా సునీల్ పాన్ ఇండియా లెవెల్ ఆర్టిస్ట్. పుష్ప సినిమాతో మిగిలిన భాషల్లో కూడా సునీల్ కి మంచి గుర్తింపు వచ్చింది.

    Also Read: Anchor Anasuya: తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అనసూయ…

    Tags