Gujarat Bridges Second Accident:మనదేశంలో నదులు చాలా ఎక్కువగా ఉంటాయి. వాగులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ప్రాంతాలను కలుపుతూ ఈ నదుల మీదుగా మనదేశంలో అనేక వంతెనలు ఉన్నాయి.. ఈ వంతెనల మీదుగా రాకపోకలు సాగుతున్నాయి. వర్షాలు విపరీతంగా కురిసినప్పుడు.. వరదలు ముంచెత్తినప్పుడు ఈ వంతెనలు దెబ్బతింటాయి. ఎందుకంటే నీటి ప్రవాహం విపరీతంగా ఉన్నప్పుడు ఏ కట్టడం కూడా నిలబడదు. దానికి వంతెనలు మినహాయింపు కాదు. మనదేశంలో వర్షాకాలంలో ఆస్తి నష్టం సర్వసాధారణంగా చోటు చేసుకుంటుంది. వర్షాలు విపరీతంగా కురిసినప్పుడు.. వరదలు విపరీతంగా సంభవించినప్పుడు వంతెనలు కూలిపోతుంటాయి.
Also Read: పూజ హెగ్డే ని దారుణంగా అవమానించిన తమిళ హీరో ధనుష్..పరువు మొత్తం పొయ్యిందిగా!
మనదేశంలో ఈశాన్య ప్రాంతాలలో ప్రతి ఏడాది వానా కాలంలో విపరీతంగా వర్షాలు కురుస్తుంటాయి. ఆ సమయంలో ఆస్తి నష్టం తీవ్రంగా జరుగుతూ ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురిసినప్పుడు వంతెనలు, ఇతర కట్టడాలు కూలిపోతుంటాయి. ఆ సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా విపరీతంగా చోటు చేసుకుంటుంది.. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలోని మహిసాగర్ మీద ఉన్న గంభీర వంతెన కుప్ప కూలిపోయింది. దీంతో వాహనాలు నదిలో పడిపోయాయి. వడోదర, ఆనంద్ జిల్లాలను ఈ వంతెన కలుపుతుంది. ఈ వంతెనలో మధ్యభాగం కూలిపోవడంతో వాహనాలు మొత్తం అందులో పడిపోయాయి.
గుజరాత్ లో ఇటీవల కాలంలో మోర్బి వంతెన కూలిపోయింది. ఆ ప్రమాదంలో దాదాపు 140 మందికి పైగా కన్నుమూశారు. ఒక్కసారిగా జనం వంతెన మీదికి రావడంతో అది కుప్పకూలిపోయింది. వాస్తవానికి చాలా సంవత్సరాల క్రితమే ఈ వంతెన నిర్మించారు. ప్రమాదం జరగడానికి ముందు వంతెన మీద చాలామంది ఉన్నారు. ఒక్కసారిగా వంతెన కుంగిపోవడంతో 140 మంది కన్నుమూశారు. ఇక గుజరాత్ అధికారంలో ఉన్న బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా వంతెనలు కూలిపోతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి.. బీహార్ రాష్ట్రంలో వరుసగా ఇటీవల వంతెనలు కూలిపోయాయి. ఇక ఆమధ్య నిర్మాణంలో ఉన్న వంతెన ఒకటి కూలిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వంతెన నిర్మాణంలో ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరించారు. ఏకంగా 90 డిగ్రీల కోణంలో నిర్మించి అభాసుపాలయ్యారు. ఈ వంతెన నిర్మాణం పై విమర్శలు వచ్చినప్పటికీ.. అధికారులు సమర్ధించుకోవడం విశేషం.
Also Read: గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ కి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలుసా..?
డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం వంతెనల నిర్మాణంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ” డబుల్ ఇంజన్ సర్కార్ అని బిజెపి నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. అన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉండాలని చెబుతోంది. కానీ వారు చేస్తున్న పని ఇంత దారుణంగా ఉంది. నిర్మించిన వంతెనలు కూలిపోతున్నాయి. నిర్మాణంలో ఉన్న వంతెనలు కొట్టుకుపోతున్నాయి. నిబంధనలు పాటిస్తే బాగుంటుంది. నీటిలో మేడలు కడితే ఇలానే ఉంటుంది. ఇప్పటికైనా డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం వెనక ఎదుటి మోసం ఉందో ప్రజలు గ్రహించాలని” కాంగ్రెస్ నేతలు అంటున్నారు.