Gabbar Singh Villain Remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది నటులు తనలోని విలక్షణమైన నటునను చూపిస్తూ స్టార్ హీరోలుగా కూడా ఎదిగారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమా చేస్తున్న నేపద్యంలో ఇక ఇలాంటి క్రమంలోనే ఎవరికి వారు భారీ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. రక్త చరిత్ర (Raktha Charithra) సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) రీసెంట్ గా ఆయన ఒక పోడ్ కాస్ట్ లో పాల్గొన్నప్పుడు ఈ సినిమా మొత్తానికి కేవలం అతనికి 40 వేలు మాత్రమే ఇచ్చారని చెప్పాడు. అయితే ఆ సినిమాలో అతని పాత్ర చాలా హైలెట్గా నిలవడమే కాకుండా అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇంప్రెస్స్ అయ్యారు. మరి ఏది ఏమైనా కూడా ఆ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) తో చేసిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమాలో తనని విలన్ గా తీసుకోవడంతో రెమ్యూనరేషన్ దాదాపు 40 లక్షల వరకు ఇచ్చారని చెప్పడం విశేషం…ఒక్క సినిమాతో ఆయన క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఆయన విలనిజాన్ని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. అది ఈ విషయాన్ని కూడా అతను పోడ్ కాస్ట్ లో చెప్పడం విశేషం…పవన్ కళ్యాణ్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా గొప్ప విషయమని ఆయన చాలా మంచి నటుడు అని అభిమన్యు సింగ్ చెబుతూ ఉండడం విశేషం…
Also Read: రంగస్థలం నేనే చేయాల్సింది, డైరెక్టర్ తో నా సీన్స్ తీసేయమన్నాను… మొగలి రేకులు సాగర్ షాకింగ్ కామెంట్స్
ఇక ఏది ఏమైనా కూడా గబ్బర్ సింగ్ సినిమా వల్లే అతను ఇండస్ట్రీలో ఉన్నాననే మాటలు కూడా చెప్పాడు. మరి ఇప్పుడు కూడా ఆయన చాలా బిజీ నటుడిగా ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు… సినిమాల్లో నటులుగా మంచి గుర్తింపును సంపాదిస్తే భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ అందుతాయి. అలా కాకుండా చిన్నచితికా పాత్రలు చేసుకుంటూ వెళ్తే ఎప్పుడు స్ట్రగులింగ్ లోనే ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక అభిమన్యు సింగ్ తన ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలని కోరుకుందాం…అయితే ఆయన ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికి గబ్బర్ సింగ్ రేంజ్ లో మరొక పాత్ర అయితే ఆయనకు రావడం లేదు. మరి ఇలాంటి క్రమంలో ఆయన మంచి సినిమాలు చేసి మరింత ముందుకు వెళితే అతని అభిమానులు కూడా ఆనందపడతారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…