Gujarat Bridge Collapses: మన భూమి అంతటా ఒకే మాదిరి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించాలి అంటే రోడ్లు అవసరం.. కానీ అన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం సాధ్యం కాదు. నదులు, వాగులు, కొండలు ప్రాంతాల మీదుగా వెళ్ళాలి అంటే వంతెనలు తప్పనిసరి. అలాగని కాంక్రీట్, ఇనుముతో అన్ని చోట్ల వంతెనలు నిర్మాణం సాధ్యం కాదు. అలాంటి స్థితిలో ఇంజ నీర్ల మదిలో మెదిలిన అద్భుతమే తీగల వంతెన. గుజరాత్ రాష్ట్రంలో పురాతన కేబుల్ వంతెన కూలి ఆదివారం 90 మంది దాకా చనిపోయారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న కేబుల్ వంతెనల పై మరోసారి చర్చ మొదలయింది. ఈ కేబుల్ వంతెనలు ఎలా రూపొందిస్తారు? అవి ఎన్ని రోజులు మన్నుతాయి? అసలు ఈ కేబుల్ వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఏమిటి? దేశంలో కేబుల్ వంతెనలు ఎన్ని ఉన్నాయి? ఈ కథనంలో అన్ని వివరాలూ ఉన్నాయి. వాటిపై ఓ లుక్ వేయండి.

కేబుల్-స్టేడ్ వంతెనలు పైలాన్‌లు అని పిలిచే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టవర్‌లతో నిర్మిస్తారు. ఈ టవర్‌ల నుంచి కేబుల్స్ వంతెన డెక్‌కు మద్దతు ఇస్తాయి. వీటిల్లో కూడా ఎక్స్‌ట్రా డోస్డ్ బ్రిడ్జ్, కాంటిలివర్ స్పార్ కేబుల్-స్టేడ్ బ్రిడ్జ్, మల్టిపుల్-స్పాన్ కేబుల్-స్టేడ్ బ్రిడ్జ్, కేబుల్-స్టేడ్ క్రెడిల్-సిస్టమ్ బ్రిడ్జ్ వంటి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి.
కచ్చి దర్గా-బిదుపూర్ వంతెన
వెర్సోవా-బాంద్రా సీ లింక్, కృష్ణరాజపురం వంతెన, అక్కర్ వంతెన సిక్కిం, అంజి ఖాడ్ వంతెన, హౌరాను కోల్‌కతాతో కలిపే హుగ్లీ నదిపై నివేదిత సేతు వంటి అనేక కేబుల్-స్టేడ్ బ్రిడ్జ్‌లు పూర్తయ్యాయి. కొన్ని నిర్మాణంలో ఉన్నాయి.
మూడవ మండోవి వంతెన/అటల్ సేతు, గోవా
మూడవ మండోవి వంతెనను అటల్ సేతు అని పిలుస్తారు, ఇది పనాజీ, పోర్వోరిమ్ మధ్య మాండోవి నదిపై జాతీయ రహదారి 66 ఈ వంతెన మీదుగా వెళుతుంది.. .
అటల్ సేతు: గోవాలో 5.1 కి.మీ పొడవైన తీగల వంతెన. భారతదేశంలో మూడవ పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన.
మూడో నర్మదా వంతెన/కొత్త నర్మదా వంతెన:
భరూచ్ కొత్త నర్మదా వంతెనను నర్మదా నదిపై భరూచ్ వద్ద మూడో నర్మదా వంతెనగా పిలుస్తారు. ఇది భారతదేశంలోని అతి పొడవైన స్పేన్‌లతో విస్తరించిన వంతెన. వడోదర, సూరత్ మధ్య ఎన్ హెచ్-8 మీదుగా నిర్మించే ఆరు లేనింగ్ ప్రాజెక్ట్‌లో భాగం. ఇది అత్యంత ఎత్తైన నిర్మాణం, ఇది వజీరాబాద్‌ను తూర్పు ఢిల్లీని కలుపుతుంది. ఇది యమునా నదిపై ఒక కాంటిలివర్ స్పార్ కేబుల్-స్టేడ్ బ్రిడ్జ్.
రాజా భోజ్ సేతు, భోపాల్
రాజా భోజ్ సేతు అనేది భోప్ల్‌లోని విఐపి రహదారితో కమ్లా పార్క్‌ను కలుపుతూ ఒక కేబుల్-స్టేడ్ వంతెన. ఈ వంతెన పరమారా రాజవంశానికి చెందిన భోజ రాజు పేరు మీద రాజా భోజ్ సేతు అని పేరు పెట్టారు.

రామ్ ఝూలా, నాగ్‌పూర
రామ్-ఝూలా-నాగ్‌పూర్
రామ్ ఝూలా అనేది నాగ్‌పూర్‌లోని నాగ్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లోని రైల్వే ట్రాక్‌లపై కేబుల్-స్టేడ్ వంతెన. ఈ వంతెన నగరం అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉంది.
కేబుల్-స్టేడ్ రైల్వే బ్రిడ్జ్- అంజి ఖాడ్
జమ్మూ-బారాముల్లా లైన్‌లోని కత్రా, రియాసి సెక్షన్‌లను కలుపుతూ భారతీయ రైల్వేలోని అంజి ఖాడ్ వద్ద కేబుల్-స్టేడ్ వంతెన నిర్మాణంలో ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన అయిన చీనాబ్ వంతెన మాదిరిగానే ఈ వంతెనను మొదట ప్రతిపాదించారు. ఇవే కాకుండా కృష్ణ నది పై ఏపీ, తెలంగాణ ను కలుపుతూ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఇటీవల దీనికి సంబంధించి మ్యాప్ ను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విడుదల చేశారు. పరుల దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.