https://oktelugu.com/

రోడ్లపైకి గ్రేటర్ ఆర్టీసీ..?

రాష్ట్రంలోని హైదరాబాద్ మినహ అన్ని ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ అనుసరించి ఆర్టీసీ బస్సులను తిప్పుతుంది. భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంది. జిల్లాల్లో ఆర్టీసీ సర్వీసులు గాడిన పడటంతో ఇప్పుడు అందరు హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతాయోనని ఎదురు చూస్తున్నారు. సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా బస్సు ఎక్కాల్సిందే. చిరు వ్యాపారులు మొదలుకుని, ప్రైవేట్ కంపెనీలలో పని చేసే ఉద్యోగుల వరకూ సిటీ బస్సులలో జర్నీ చేయాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా 10వేల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 27, 2020 / 01:44 PM IST
    Follow us on

    రాష్ట్రంలోని హైదరాబాద్ మినహ అన్ని ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ అనుసరించి ఆర్టీసీ బస్సులను తిప్పుతుంది. భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంది. జిల్లాల్లో ఆర్టీసీ సర్వీసులు గాడిన పడటంతో ఇప్పుడు అందరు హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతాయోనని ఎదురు చూస్తున్నారు. సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా బస్సు ఎక్కాల్సిందే. చిరు వ్యాపారులు మొదలుకుని, ప్రైవేట్ కంపెనీలలో పని చేసే ఉద్యోగుల వరకూ సిటీ బస్సులలో జర్నీ చేయాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా 10వేల 400 బస్సులు ఉండగా,  హైదరాబాద్ సిటీలోనే 3 వేల 858 బస్సులు ఉన్నాయి. అందులో ఏసీ 142 ఉన్నాయి. ప్రతి రోజు ఆర్టీసీ సిటీ బస్సులలో 2లక్షలకు పైగా ప్రయాణం చేస్తుంటారు.

    ఆర్టీసీ ఆదాయం రోజుకి  13 కోట్లు అయితే  అందులో ఎక్కువ మొత్తం సిటీ ఆర్టీసీ నుంచే వస్తుంది. వాటితో పాటు నష్టం కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటుంది.  దీనికితోడు  ఉద్యోగుల సమ్మె తరువాత సిటీలో చాలా రూట్లలో తిరిగే బస్సులకు కోత పెట్టారు. ఎన్ని బస్సులు కుదించినా… ఆర్టీసీకి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. లాక్ డౌన్ కారణంగా 65 రోజులుగా సిటీ బస్సులు డిపొలకే పరిమితం అయ్యాయి. అత్యవసర సేవల సిబ్బందికి తప్ప,  సిటీలో బస్సులు తిప్పడం లేదు. వలస కూలీలను వారు ఉండే ఏరియా నుంచి రైల్వే స్టేషన్ కు అధికారుల అదేశాలతో నడిపిస్తున్నారు.

    రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో మాదిరిగా, నగరంలో సిటీ బస్సులు తిప్పేందుకు అవకాశం ఉందని నగర వాసులు భావిస్తున్నారు. మార్చి నెలలో బస్సు పాస్ తీసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మిగిలిన రోజులకు సంబంధించి పాస్  పునరుద్ధరణ చేస్తారా లేదా అనుమానాలున్నాయి. అసలు పూర్తి స్థాయిలో బస్సులు తిరిగేందుకు ఆదేశాలు జారీ చేస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.  గ్రేటర్ ఆర్టీసీ అధికారులు మాత్రం సిటీ బస్సులు తిప్పే అంశంపై,  ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే.. అప్పుడు బస్సులు తిప్పేందుకు తాము సిద్ధమంటున్నారు.

    గ్రేటర్ లో కరోనా విజృంభిస్తున్నందున సిటీలో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తే… మునుపటి తరహాలో కండక్టర్లు పని చేస్తారా లేదా అనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పాయింట్ టూ పాయింట్ బస్సులు నడిపితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కే ముందే బస్టాప్ లో టిక్కెట్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. సిటీ బస్సుల్లో భౌతిక దూరం పాటించడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న అందరిలో మొదులుతోంది. భౌతిక దూరం పాటిస్తూ బస్సులు తిప్పితే ఆర్టీసీ ఆక్యుపెన్సీ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లు ఎక్కువగా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు తిప్పే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్,  ఎలా ఆదేశిస్తే అలా చేయాలనే ఆలోచనలో గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ఉన్నారు.