ఊబకాయుడైన కన్నాకు దీక్షలు అవసరం..!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఊబకాయంతో బాధపడుతున్నందున ఆయనకు ఉపవాస దీక్షలు అవసరమని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నిన్న దీక్ష కారణంగా ఒక అరా కేజీ బరువు తగ్గి ఉంటారని నువ్వులు పూయించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ టిటిడి నిరర్దక ఆస్దులు విక్రయించాలని టిడిపి ప్రభుత్వం హయాంలో సబ్ కమిటి వేశారని, ఆ సబ్ కమిటిలో భానుప్రకాష్ రెడ్డి, డిపి అనంత, సుచిత్రా ఎల్లా, సండ్ర వెంకట వీరయ్య(టిడిపి ఎంఎల్ఏ)లు ఉన్నారని […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 4:24 pm
Follow us on


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఊబకాయంతో బాధపడుతున్నందున ఆయనకు ఉపవాస దీక్షలు అవసరమని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నిన్న దీక్ష కారణంగా ఒక అరా కేజీ బరువు తగ్గి ఉంటారని నువ్వులు పూయించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ టిటిడి నిరర్దక ఆస్దులు విక్రయించాలని టిడిపి ప్రభుత్వం హయాంలో సబ్ కమిటి వేశారని, ఆ సబ్ కమిటిలో భానుప్రకాష్ రెడ్డి, డిపి అనంత, సుచిత్రా ఎల్లా, సండ్ర వెంకట వీరయ్య(టిడిపి ఎంఎల్ఏ)లు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సబ్ కమిటి దాదాపు 53 నిరర్ధక ఆస్ధులను గుర్తించిందన్నారు. వాటిలో 50 ఆస్తులను విక్రయించాలని బిజేపి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి సంతకం చేశారని చెప్పారు. 2016, జనవరి 30వ తేదీన సబ్ కమిటి ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

హరి ప్రసాద్ అనే వ్యక్తి జనసేన తరపున కూడా మెంబర్ గా ఉన్నారని తెలిపారు. వీరందరూ కలసి టిటిడి ఆస్ధులు అమ్మాలని తీర్మానం చేసింది వాస్తవమా కాదా కన్నా సూటిగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
టిటిడి ఆస్తులకు సంబంధించి విలువలు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో నిర్ణయించినవేనని తెలిపారు. వీటన్నింటిని పక్కన పెట్టి వాళ్లే అమ్మమని చెప్పి ఈ రోజు రాద్దాంతం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు దీని వల్ల లాభం లేదు గాని కన్నాకు హెల్త్ రీత్యా ఉపయోగపడచ్చు అని చెప్పారు. మొన్న పోతిరెడ్డిపాడు విషయంలో చూసాం, బిజేపి తెలంగాణాలో ఒక స్టాండ్, ఆంధ్రప్రదేశ్ లో ఒక స్టాండ్ తీసుకుంటోందన్నారు. అదే విధంగా టిటిడి ఆస్తుల విషయంలో కన్నా లక్ష్మీ నారాయణ ఒక స్టాండ్, భానుప్రకాష్ రెడ్డి ఒక స్టాండ్ తీసుకున్నారని విమర్శించారు. అధిష్టానాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రతివారికి తప్పుడు సమాచారం పంపిస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వంలో హిందుత్వానికి ముప్పు జరుగుతోందని, హిందుత్వం అంటే ఏదో కన్నా లక్ష్మీ నారాయణ ఇంట్లో పుట్టినట్లుగా హిందూ సమాజాన్ని ఆయన ఒక్కడే ఉద్దరిస్తున్నట్లుగా మాట్లాడం సరైంది కాదన్నారు.

చంద్రబాబు నలభై ఆలయాలు పడగొట్టినప్పుడు బిజేపి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబుకు అమ్ముడుపోయి జగన్ మోహన్ రెడ్డిని ఎదిరించలేక, సంక్షేమ పధకాలు ఆగాయని, అభివృధ్ది ఆగిందని చెప్పలేక, చివరకు హిందూమతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే వ్యక్తి కూడా ఒక రాజకీయనాయకుడేనా అంటూ ఎద్దేవ చేశారు. అదే విధంగా చంద్రబాబు, అతని చేసిన తప్పును కూడా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పడం చాలా బాధాకరం అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన ఆర్డర్ ను రద్దు చేస్తూ సీఎం పేషి నుంచి ఆదేశాలు ఇస్తే అది కూడా రాజకీయం అంటూ కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతున్నారని చెప్పారు. డబ్బులకు అమ్ముడుపోయినా ఇంత నీచ రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు.