spot_img
Homeజాతీయ వార్తలుGreat Nicobar project controversy: గ్రేటర్‌ నికోబార్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌.. చైనాకు ఇబ్బందనేనా?

Great Nicobar project controversy: గ్రేటర్‌ నికోబార్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌.. చైనాకు ఇబ్బందనేనా?

Great Nicobar project controversy: దేశ భద్రత, దేశ రక్షణ, హిందూ మహా సముద్ర జలాల్లో భారత నౌకల భద్రతను దృష్టిలో పెట్టుకుని మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం గ్రేటర్‌ నికోబార్‌ ప్రాజెక్టును చేపట్టింది. ఇది మలక్కా జలసంధి నుంచి శ్రీలంక వరకు ఉన్న సాగర జలమార్గాల రక్షణతోపాటు భారత ప్రయోజరాలను కాపాడుతుంది. ఇది భారత జాతీయ భద్రతకు మూలస్తంభంగా మారనుంది. హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావాన్ని అడ్డుకునే ఈ ప్రాజెక్టును రాహుల్‌ గాంధీ వ్యతిరేకిస్తున్నారు.

ప్రాజెక్తు విశేషాలు
రూ.72 వేల కోట్ల బడ్జెట్‌తో 200 చ.కి.మీ. విస్తీర్ణంలో ఓడరేవు, ఎయిర్‌స్ట్రిప్, రెసిడెన్షియల్‌ జోన్లు నిర్మిస్తున్నారు. మలక్కా స్ట్రెయిట్‌ నుంచి అండమాన్‌ సముద్రం వరకు 2,500 కిలోమీటర్ల సముద్ర మార్గాలను కాపాడుతుంది. 2040 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టు ట్రైసర్వీస్‌ డ్యూయల్‌ యూజ్‌ ఫెసిలిటీగా పనిచేస్తుంది.

భద్రతా ప్రాధాన్యత
చైనా పీఎల్‌ఏ నావీ అండమాన్‌ నికోబార్‌లో పెరుగుతున్న ఉన్నతి అడ్డుకోవడానికి ఈ ప్రాజెక్టు కీలకం. ఐఎన్‌ఎస్‌ కోహసా ఎయిర్‌స్ట్రిప్, అడ్వాన్స్‌డ్‌ నావల్‌ ఫెసిలిటీలు చైనా సబ్‌మెరైన్‌లను ట్రాక్‌ చేస్తాయి. మలక్కా జలసంధి రక్షణ బలపడుతుంది.

Also Read: భారత్ మీద క్రూడాయిల్ బాంబు.. అన్ని వ్యవస్థలకూ ప్రమాద ఘంటికలు

రాజకీయ వివాదం
నికోబార్‌ ప్రాజెక్టుపై సోనియా గాంధీ కేంద్రానికి లేఖ రాసి, పార్లమెంట్‌లో ప్రస్తావించారు. రాహుల్‌ గాంధీ ‘గిరిజనులకు అన్యాయం, విధ్వంసం‘ అని ఆపాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ మాత్రం ‘చైనా మద్దతుకోసం, దేశ భద్రతను బలి పెట్టాని కాంగ్రెస్‌ కోరుకుంటోంది’ అని ఆరోపిస్తోంది.

ఎన్‌జీటీ అనుమతి ఇచ్చినా..
నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ 25 శాతం అడవి ప్రాంతాన్ని కాపాడుతూ క్లియరెన్స్‌ ఇచ్చింది. 15 శాతం మాత్రమే అడవి ప్రాంతం ప్రభావితమవుతుందని నిర్ధారించింది. షరతులతో అనుమతి ఇచ్చి, గిరిజనులకు పునర్వసతి, ఉపాధి హామీ ఇచ్చింది. షోంపెన్, నికోబరీలకు 10 వేల కోట్ల రూపాయల ఫండ్‌ కేటాయించారు. స్కూళ్లు, హాస్పిటల్స్, ట్రైబల్‌ హౌసింగ్, ఫిషరీస్‌ ప్రాజెక్టులతో అభివృద్ధి. 5,000 ఉపాధి అవకాశాలు, స్థానికులకు 26 శాతం లీజ్‌ రెవెన్యూ షేర్‌ హామీ ఇచ్చింది.

బీజేపీ కౌంటర్‌
‘కాంగ్రెస్‌ చైనా లాంటి శత్రువుల ప్రయోజనం కోసం జాతీయ భద్రత ప్రాజెక్టులను అడ్డుకుంటోంది‘ అని బీజేపీ ఎంపీ రామ్‌ విలాస్‌ వెదం విమర్శించారు. 1962 యుద్ధంలో కాంగ్రెస్‌ చైనాకు అవకాశం ఇచ్చిన చరిత్ర గుర్తు చేశారు. క్వాడా భాగస్వామి అస్ట్రేలియా ‘గ్రేటర్‌ నికోబార్‌ ఇండో–పసిఫిక్‌ భద్రతకు కీలకం‘ అని సమర్థించింది. ఇండో–పసిఫిక్‌ కమాండర్‌ ‘చైనా ఆధిపత్యాన్ని అడ్డుకుంటుందని అమెరికా పేర్కొంది.

2027 ఎన్నికల ముందు జాతీయ భద్రత, పర్యావరణ రాజకీయం ఆయుధంగా మారనుంది. బీజేపీ ‘దేశ శత్రుత్వం‘ అని, కాంగ్రెస్‌ ‘గిరిజన హక్కులు‘ అని వాదనలు కొనసాగుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version