Homeజాతీయ వార్తలుIndia Crude Oil Crisis: భారత్ మీద క్రూడాయిల్ బాంబు.. అన్ని వ్యవస్థలకూ ప్రమాద ఘంటికలు

India Crude Oil Crisis: భారత్ మీద క్రూడాయిల్ బాంబు.. అన్ని వ్యవస్థలకూ ప్రమాద ఘంటికలు

India Crude Oil Crisis: మనదేశంలో పెట్రో అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మన అవసరాలు తగ్గట్టుగా మన దేశంలో చమురు ఉత్పత్తి కాదు. మన అవసరాలకు విదేశాల నుంచి దిగుమతులే శరణ్యం. గల్ఫ్.. ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూ.. దానిని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఇతర చమురు పదార్థాలు తయారు చేస్తారు. మన దేశంలో పెట్రోల్ కంటే కూడా డీజిల్ వినియోగం అధికంగా ఉంటుంది.. క్రూడ్ ఆయిల్ ను ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. ఇందుకోసం భారీగానే విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు పెడుతుంటాం.

మధ్య ఆసియా ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనికి తోడు ముడి చమురు రవాణా చేసే నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇరాన్ తమ దేశంలో ఉన్న హార్మోజ్ జల సంధి నుంచి నౌకల రాకపోకలను ఆపివేయడమే.. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు ఆగిపోవడం.. ఇంకా రకరకాల కారణాలవల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే బ్యారల్ ధర 110 డాలర్లకు చేరుకుంది.

ఈ స్థాయిలో ధర పెరగడంతో ఇండియా నుంచి మొదలు పెడితే అనేక దేశాలలో ఆందోళన పెరిగింది. మన దేశానికి 85% చమురు విదేశాలనుంచి వస్తుంది. దీనివల్ల ఇండియా దిగుమతుల బిల్లు విపరీతంగా పెరిగిపోతుంది. ఇది విదేశీ మారకద్రవ్య నిల్వల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా రూపాయి విలువ మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఇంధనం ధరలు పెరిగిపోతే నిత్యవసరాల ధరలు కూడా అత్యంత ఖరీదుగా మారిపోతాయి. అప్పుడు సగటు మనిషి జీవన వ్యయం పెరుగుతుంది.

ఇప్పటికే కమర్షియల్ డీజిల్ మీద ధర పెరిగింది. దీంతో అన్ని కంపెనీలు సాధారణ డీజిల్ వాడటం మొదలుపెట్టాయి.. ఈ క్రమంలో డీజిల్ వినియోగం పెరిగింది. పెట్రోల్ వినియోగం కూడా అదే స్థాయిలో ఉంది. కంపెనీలు ధరల ఒత్తిడి నేపథ్యంలో ఉత్పత్తి తగ్గించాయి. దీంతో డిమాండ్ కు సరిపడా ఇంధనం లభించడం లేదు. దీంతో మార్కెట్లో ఒత్తిడి పెరిగిపోతుంది.. అవసరాలకు సరిపడా ఇంధనం దొరకపోవడంతో ఇబ్బందికరమైన వాతావరణ ఏర్పడుతోంది.. ఈ సమస్యకు ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపుతుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version