National Flag : ఈ ఆగస్టు 15తో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఈ సందర్భంగా 75 ఏళ్ల పండుగను కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఘనంగా ప్రారంభించింది.

ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్రం ఈ మేరకు జాతీయ జెండాను ఇంటిపై ఎగురవేసిన తర్వాత దాన్ని ఎలా మడవాలి? ఎలా భద్రపరచాలి? జాతీయ జెండాను మడతపెట్టడానికి.. దాన్ని ఎలా భద్రపరచాలన్న దానిపై కీలక సూచనలు చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దశల వారీగా ఈ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
-జాతీయ జెండాను ఎలా మలచాలన్న దానిపై సూచనలు
-జెండాను అడ్డంగా ఉంచండి.
-కాషాయ రంగు మరియు ఆకుపచ్చ రంగుల మధ్య తెల్లని బ్యాండ్ కింద మడవండి.
-కాషాయ రంగు మరియు ఆకుపచ్చ బ్యాండ్‌ల భాగాలతో అశోక్ చక్రం మాత్రమే కనిపించే విధంగా తెల్లటి పట్టీని మడవండి.
-ప్రక్రియ పూర్తయిన తర్వాత, దానిని భద్ర పరచడానికి మడతపెట్టిన జెండాను అరచేతులపై లేదా చేతులపై తీసుకెళ్లండి.
హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేయడంతోపాటు.. కేంద్ర ప్రభుత్వం పౌరులను వారి సోషల్ మీడియా ఖాతాలలో వారి ముఖ చిత్రంగా భారతీయ జెండా ను డీపీగా పెట్టుకోవాలని సూచించింది. తిరంగా బైక్ ర్యాలీ కూడా దేశంలోని అనేక ప్రదేశాలలో తీస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ జెండాకు అవమానం కాకుండా ఈ కీలక సూచనలు పాటించి జెండాను భద్రంగా దాచిపెట్టాలని కేంద్రం సూచనలు చేసింది.
[…] […]
[…] […]