https://oktelugu.com/

సామాన్యులతో ఆటలా? దెబ్బకు దిగొచ్చిన కేంద్రం

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని సవరిస్తూ ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గించేది లేదంటూ స్పష్టం చేసింది. వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిన్న కేంద్రం నిర్ణయం తీసుకోగా.. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ.. ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పొరపాటున జారీ అయినవేనని, […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 1, 2021 / 10:47 AM IST
    Follow us on


    చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని సవరిస్తూ ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గించేది లేదంటూ స్పష్టం చేసింది. వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిన్న కేంద్రం నిర్ణయం తీసుకోగా.. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ.. ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పొరపాటున జారీ అయినవేనని, వాటిని వెనక్కి తీసుకుంటామని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు.ఆయా పథకాలపై గత ఆర్థిక సంవత్సరం (2020–-21) చివరి త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయంటూ ఆమె ట్వీట్ చేశారు.

    చిన్న మొత్తాల పెట్టుబడులపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. గత మూడు త్రైమాసికాలలో కొనసాగిస్తూ వచ్చిన వడ్డీ రేటును ఏప్రిల్ ఒకటి నుంచి మొదలయ్యే త్రైమాసికంలో తగ్గిస్తున్నట్లు కేంద్రం బుధవారం తెలిపింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై వడ్డీని 7.1 శాతం నుంచి 6.4కు కేంద్రం తగ్గించింది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై వడ్డీని కూడా 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. వార్షిక డిపాజిట్లపై వడ్డీని 5.5 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గించారు. మరోవైపు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించారు.

    సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేటును 7.6 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ)పై వడ్డీ రేటును 6.8 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించారు. ప్రభుత్వ రాబడుల ఆధారంగా, ప్రతీ ఆర్థిక త్రైమాసికానికీ ప్రభుత్వం చిన్న మొత్తాల పెట్టుబడులపై వడ్డీ రేట్లను ప్రకటిస్తుంటుంది. ఉద్యోగులు ఎక్కువగా ఈ చిన్నమొత్తాల పెట్టుబడులపై ఆసక్తి కనబరుస్తుంటారు. వీటిలో చాలా పెట్టుబడులకు ఆదాయపు పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్