Governor Tamilisai -KCR: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నా తాను మాత్రం ప్రజల పక్షాన నిలుస్తానని చెప్పారు. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రాష్ట్ర గవర్నర్ ను అయిన తనకు సరైన విధంగా గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం. భద్రాచలం పర్యటనకు వెళ్తే హెలికాప్టర్ కూడా సమకూర్చకుండా ప్రభుత్వం తనను అవమానించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇంత అమానుషంగా ప్రవర్తించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత మూడేళ్లుగా ప్రభుత్వం తనను కాదని ఒంటెత్తు పోకడ పోవడంతో ఎక్కడికి పిలవడం లేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇంత పక్షపాతంగా వ్యవహరించడంతో తాను ఎన్నో మార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశించినా అది మాత్రం జరగలేదు. ఫలితంగా రోజురోజుకు గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య దూరం ఇంకా పెరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని సైతం లేకుండా చేయడం వారి అనైతికతకు నిదర్శనమే.
Also Read: Nagarjuna Vs Samantha: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా హీరో నాగార్జున..! జనసేన అభ్యర్థిగా సమంత!?
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిన సందర్బంగా కూడా గవర్నర్ పై ఇంతటి వివక్ష చూపడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గతి ఏమవుతుందో తెలిసినా సీఎం ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మంత్రులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. గవర్నర్ తీరుపై మంత్రులు మాట్లాడటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రొటోకాల్ సైతం పాటించకుండా ఏ సమాచారం కూడా ఇవ్వకుండా చేస్తున్నారని వాపోయారు. అయినా తాను మాత్రం రాష్ట్రంలో పర్యటనలు చేస్తూనే ఉన్నానని చెబుతున్నారు.
ప్రభుత్వం ఇంకా ఎన్ని దురాగాతాలు చేస్తుందో తెలియడం లేదు. గవర్నర్ పై పక్షపాతంగా వ్యవహరిస్తూ కావాలనే దూరం పెడుతున్నారని వెల్లడిస్తున్నారు. రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి ఫిర్యాదు చేసి ప్రభుత్వ తీరును అడ్డుకుంటామని చెబుతున్నారు. రాజ్యాంగపరంగా నియమితులైన గవర్నర్ పదవిపై నేతలకు ఎందుకు ఇంత వివక్ష అని అడుగుతున్నారు. ఏదైనా ఉంటే కేంద్రంతో చూసుకోవాలే కానీ ఇక్కడ కేంద్రం ప్రతినిధిగా ఉన్న తనపై అక్కసు పెంచుకుంటే వారికే నష్టం. ఆడబిడ్డనైన తనపై కావాలనే దురుద్దేశ పూర్వకంగా వ్యవహరించడం వారి స్థాయికి సరైనది కాదని హితవు పలుకుతున్నారు. మొత్తానికి ఇద్దరి మధ్య జరుగుతున్న దూరం ఎందాక వెళ్తుందో తెలియడం లేదు.
బీజేపీపై ఉన్న కోపంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఏదైనా కేంద్రంతో తేల్చుకోవాలే కానీ ఇక్కడ రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న ఆమెపై కుట్రలు చేయడం టీఆర్ఎస్ నేతలకు తగదని ప్రతిపక్ష పార్టీలు సైతం ఇదివరకే హెచ్చరించాయి. అయినా వారిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. భవిష్యత్ లో వీరి వ్యవహారం ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు.
Also Read:BJP- 2024 Elections: 2024కు బీజేపీ రెడీ.. స్కెచ్, టీం సిద్ధం