నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలను రాజ్ భవన్ అధికారులు ప్రభుత్వానికి పంపారు. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించే విషయంలో సానుకూలంగా స్పందించారు. ఎస్ఇసి నియామకం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించడంతోపాటు హైకోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అంగీకరించనందున నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఆ ఎంపిక ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డను తొలగించిన వ్యవహారంలో దాఖలైన పిటీషన్ లను విచారించిన హైకోర్టు ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని చెప్పింది. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని, ప్రభుత్వం జస్టిస్ కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హై కోర్టు రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకుండా ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు అందుకు నిరాకరించడంతోపాటు రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడుకోవద్దంటూ కఠిన వ్యాఖ్యలను చేసింది.
అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించలేదు. దీంతో నిమ్మగడ్డ హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు చేయడంతో విచారించిన హైకోర్టు నిమ్మగడ్డకు గవర్నర్ ను కలిసి పరిస్థితిని విన్నవించాలని సూచించింది. శుక్రవారానికి ఈ వ్యవహారాన్ని తేల్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హై కోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ సోమవారం ఉదయం గవర్నర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించాలని కోరారు. ఈ అంశంపై పూర్వాపరాలను పరిశీలించిన గవర్నర్ ఎట్టకేలకు నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని హై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
పవన్ దూకుడు పాలిటిక్స్ కి బ్రేక్?
ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించేందుకు సరేమిరా అంటున్న జగన్ ప్రభుత్వానికి ఈ వ్యవహారం పెద్ద షాక్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్ఇసి వ్యవహారంలో చివరికి నిమ్మగడ్డ పంతమే నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ఆదేశాలు ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ఉన్నాయని టిడిపి నాయకులు చెబుతున్నారు. గవర్నర్ ఆదేశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే, హై కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం లోగా ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కోర్టుకు వివరించాల్సి ఉంది