spot_img
Homeఎంటర్టైన్మెంట్బాలయ్య సినిమాలో భారీ మార్పులు !

బాలయ్య సినిమాలో భారీ మార్పులు !


ప్లాప్ లకు కేరాఫ్ ఆఫ్ అడ్రెస్ అనే ముద్ర నుండి నందమూరి బాలకృష్ణకు సింహాతో విముక్తి కలిగించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. హిట్ వాసన లేక డీలా పడ్డ నట సింహానికి హిట్ ఇచ్చి.. సినిమాల్లో బాలయ్యకు మళ్ళీ మార్కెట్ తెచ్చిన ఘనత కచ్చితంగా బోయపాటికే దక్కుతుంది. కాగా ఈ మాస్ డైరెక్టర్ దర్శకత్వంలో బాలయ్య ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ కు ఎవరేజ్ టాక్ వచ్చింది. అయితే బాలయ్య అభిమానులకు మాత్రం టీజర్ బాగా నచ్చిందనుకోండి. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ లో లేటెస్ట్ గా కొన్ని మార్పులు చేశారు. సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండగా.. ఇప్పుడు ఒక హీరోయిన్ తాలూకు పార్ట్ ను తీసేసారు. అలాగే సాంగ్స్ ను కూడా తగ్గించారు. రెండు సాంగ్స్ తొలిగించారు. కరోనా రావడం, షూటింగ్ పోస్ట్ ఫోన్ అవ్వడంతో బోయపాటి మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ఈ మార్పులు చేశారు.

కరోనా రాకుండా స్టార్ హీరో ఇంటికి ప్లాస్టిక్‌ కంచె

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నారని అందులో ఒక పాత్ర, అఘోరా పాత్ర అని సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎలాంటి అఘోరా నేపథ్యం లేదని, కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని బోయపాటి టీమ్ లోని సభ్యులు చెబుతున్న తాజా అప్ డేట్. అలాగే సినిమాలో ఎలాంటి రాజకీయ నేపథ్యం కూడా లేదట, కొన్ని పోలిటికల్ డైలాగ్స్ ఉన్నా, అవి అభిమానులను దృష్టిలో పెట్టుకుని మాటలు రచయిత ఎమ్ రత్నం రాశారట.

మెగాస్టార్ భయం అదే.. కానీ దానికే ఫిక్స్ !

ఇక బాలయ్య ప్లాప్ ల పరంపరతో పాటు బోయపాటి ఖాతాలో పడిన ‘వినయ విధేయ రామ’ అనే భారీ డిజాస్టర్ కూడా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న సినిమా మార్కెట్ పై పడనుంది. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ లాంటి భారీ విజయాలు ఉన్నా.. ఆ సినిమాల సక్సెస్ ఈ సినిమాకి పెద్దగా ప్లస్ అయ్యేలా కనబడటం లేదు. ఇద్దరూ ప్లాప్ ల్లో ఉండటంతో సినిమాకి మైనస్ కానుంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం, బాలయ్యకు మరో పదేళ్లు కెరీర్ ఉంటుంది. అన్నిటికంటే ముందు వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొడతారు. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version