కార్పొరేట్లకు మోడీ దోచిపెట్టిన సొమ్ము ఎంతో తెలుసా?

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే మోడీ కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముగాస్తున్నారనేది మరోసారి రుజువైంది. కార్పొరేట్‌ సంస్థలకు గత ఐదేళ్లలో రూ.4.64 లక్షల కోట్ల పన్ను రాయితీలు కల్పించడం వెనుక ఏమై ఉంటుందా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌‌ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వం ఆమేరకు ఆదాయం కోల్పోవాల్సి వచ్చినట్లు రాజ్యసభలో సీపీఎం సభ్యుడు కెకె రాగేశ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు. Also Read: తెలంగాణ […]

Written By: Srinivas, Updated On : March 10, 2021 11:39 am
Follow us on


ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగానే మోడీ కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముగాస్తున్నారనేది మరోసారి రుజువైంది. కార్పొరేట్‌ సంస్థలకు గత ఐదేళ్లలో రూ.4.64 లక్షల కోట్ల పన్ను రాయితీలు కల్పించడం వెనుక ఏమై ఉంటుందా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌‌ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వం ఆమేరకు ఆదాయం కోల్పోవాల్సి వచ్చినట్లు రాజ్యసభలో సీపీఎం సభ్యుడు కెకె రాగేశ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.

Also Read: తెలంగాణ ఉద్యోగులకు 29 శాతం ఫిట్‌మెంట్‌.. కేసీఆర్‌‌ వ్యూహం ఏంటి..?

‘గత ఐదేళ్లలో కార్పొరేట్‌ పన్ను చెల్లింపుదారులకు ఇచ్చిన పన్ను రాయితీల వల్ల ప్రభుత్వ ఆదాయంపై పడిన ప్రభావాన్ని బడ్జెట్‌ పత్రాల రూపంలో పార్లమెంటుకు సమర్పించాం. ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు పన్ను రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకూ వివిధ ప్రోత్సాహకాలు అందిస్తుంటారు’ అని చెప్పారు.

Also Read: దీదీకి పోటీగా దాదా

ఆదాయ పన్ను చట్టం –1961లోని సెక్షన్‌ 115 జేబీ కింద 15 శాతం చొప్పున ‘మినిమం ఆల్టర్నేటివ్‌ ట్యాక్స్‌’ (మ్యాట్‌)ను విధిస్తున్నాం. రాయితీలు, మినహాయింపులు పొందాక కార్పొరేట్‌ సంస్థలు చెల్లించాల్సిన ఆదాయ పన్ను, మ్యాట్‌ కంటే తక్కువగా ఉంటే అవి విధిగా ఈ కనీస ప్రత్యామ్నాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది’ అని అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌‌ తెలిపారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్